Site icon vidhaatha

అప్పులకు లెక్కలు చెప్పలేని పరిస్థితి ఉంది

విధాత‌: ఏపీ ఆర్థిక పరిస్థితి కుక్కలు చింపిన విస్తరాకులా తయారైందని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. అలివి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. తెచ్చిన అప్పులు ఏమి చేశారో కూడా తెలియదన్నారు. అప్పులకు కనీసం లెక్కలు కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మీ సొంత కంపెనీలలో 5 రూపాయలకి తయారయ్యే మందుని పేద ప్రజలకు 200 కి అంటకడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖకి రైల్వే జోన్ తేవడం చేతకాదు కానీ మద్యం బ్రాండ్ల లో మాత్రం రైల్వే జోన్ తెచ్చారని విమర్శించారు. చీప్ లిక్కర్ కి పోలవరం పేరు పెట్టి దాన్ని కూడా అవహేళన చేశారని పేర్కొన్నారు.

Exit mobile version