Site icon vidhaatha

YS Sharmila | రాష్ట్ర విభజనపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

YS Sharmila | కాంగ్రెస్ పార్టీ సెక్యూలర్ పార్టీ.. బీజేపీ, ఇతర ప్రాంతీయ పార్టీల మాదిరిగా నియంత పార్టీ కాదని..పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని.. భాష, ప్రాంతం, మతం అని విభేదాలు ఉండవు.. మెరుగైన దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పట్ల, వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఆశయాల పట్ల నమ్మకం ఉన్న వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. భవిష్యత్తులో నాయకులుగా, ఎమ్మెల్యేలుగా కావాలి అనుకునే వారికి తనది హామీ అని చెప్పారు. పార్టీకి మీరు అండగా ఉంటే.. మీకు పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

రాహుల్ గాంధీ కచ్చితంగా ప్రధానమంత్రి అవుతారని..అది రాజశేఖర్ రెడ్డి ఆశయం కూడా అని గుర్తు చేశారు. ఆంధ్ర రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీ తప్పు కాదని.. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్ర విభజన చేయలేదన్నారు. అన్ని పార్టీలు ఒప్పుకుంటేనే రాష్ట్ర విభజన జరిగిందని స్పష్టం చేశారు. విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలో వచ్చి ఉంటే విభజన హామీలు నెరవేరి ఉండేవన్నారు. రానున్న నాలుగేళ్లు ప్రజల్లో ఉండి కష్టపడితే ప్రజానాయకులుగా ఎదుగుతారన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కాక తప్పదని..అంతా కాంగ్రెస్ లో చేరి..చరిత్ర సృష్టిద్దామని షర్మిల కోరారు.

Exit mobile version