Site icon vidhaatha

Vote Chori | ఓట్ల చోరీపై మరిన్ని ఆధారాలు బయటపెడతాం : రాహుల్‌ గాంధీ

Vote Chori | రానున్న నెలల్లో ఓట్‌ చోరీపై మరిన్ని ఆధారాలను బయటపెడతామని కాంగ్రెస్‌ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. బీహార్‌లో 65 లక్షల మంది పేదల, బలహీన వర్గాలవారి ఓట్లను ఎన్నికల కమిషన్‌ తొలగించిందని ఆరోపించారు. గురువారం బీహార్‌లోని సీతామర్షిలో ఓట్‌ అధికార్‌ యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్‌ మాట్లాడారు. ‘ఓట్ల చోరీకి పల్పడిన బీజేపీ, ఎన్నికల సంఘం బండారాన్ని మేం బయటపెట్టాం. దీనిని వాళ్లు మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటకలో చేశారు. ఇప్పుడు మళ్లీ బీహార్‌లో రిపీట్‌ చేయాలని అనుకుంటున్నారు. దానిని మేం అనుమతించే ప్రసక్తే లేదు’ అని రాహుల్ అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన రిగ్గింగ్‌కు సంబంధించి ఆధారాలు ఇస్తానని ప్రకటించారు. ‘కర్ణాటకలో ఓట్లను బీజేపీ దొంగిలించిందనేందుకు మేం ఆధారాలు బయటపెట్టాం. బీజేపీ, ఎన్నికల సంఘం ఓట్లను చోరీ చేస్తున్నాయని నేను గతంలో ఎన్నడూ ఆరోపించలేదు. ఇప్పడు కర్ణాటక ఆధారాలు మాత్రమే బయటపెట్టాను. రానున్న రోజుల్లో లోక్‌సభ, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఓట్ల చోరీని బయటపెడతాను. ఓట్లను చోరీ చేయడం ద్వారా బీజేపీ, ఆరెస్సెస్‌ ఎన్నికల్లో గెలుస్తున్నాయని మేం నిరూపిస్తాం’ అని రాహుల్‌ చెప్పారు.

బుధవారం కూడా రాహుల్‌ గాంధీ ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోద, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఎన్నికల సంఘం ఓట్లను చోరీ చేస్తున్నట్టు ఆరోపణలు చేశారు. ‘లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో గెలిచేందుకు ఒక మోడల్‌ను వాళ్లు (బీజేపీ) అభివృద్ధి చేశారు. దానికి గుజరాత్‌ నమూనా అని పేరు పెట్టారు. ఆ వివరాలను రానున్న ఆరు నెలల్లోపు మేం మీకు వెల్లడిస్తాం. ఓట్ల చోరీకి ఎలా తెర పడుతుందో బీహార్‌ యువత ప్రధాని నరేంద్రమోదీకి చూపిస్తారు’ అని రాహుల్‌ అన్నారు. గత కొద్ది రోజులుగా

Exit mobile version