Site icon vidhaatha

వైసీపీ ఎంపీటీసీ రాజీనామా

ప్రమాణ స్వీకారం చేయకనే పదవికి, పార్టీకీ రాజీనామా

విధాత‌: అనంతపురం జిల్లా కదిరి మండలం కుమ్మరి వాండ్ల పల్లి వైసీపీ ఎంపీటీసీ బత్తల రామలక్ష్మమ్మ తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే సిద్దారెడ్డి ఎన్నికల సమయంలో తనకు ఎం.పి.పి పదవి ఇస్తానని మాట ఇచ్చి తీరా ఎన్నికలలో విజయం సాదించక మాటను మరిచారని.. ఎమ్మెల్యే తమ సామాజిక వర్గానికి చెందిన‌ వారికి ఎం.పి.పి పదవి కట్టబెట్టడం అన్యాయం అని ఆవేదన వ్యక్తం చేస్తూ రాజీనామా చేశారు.

Exit mobile version