Beauty Tips | ఎండలో మీ ముఖం జిడ్డుగా మారుతోందా.. మెరిసే నిగారింపు కోసం ఇలా చేయండి..

Beauty Tips : అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. అందుకోసం ప్రతి ఒక్కరూ రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది అందంగా కనిపంచడం కోసం మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ప్రతి బ్యూటీ ప్రొడక్టును వాడుతుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వేసవిలో మాత్రం బయటికి వెళ్తే చెమటపట్టి ముఖం జిడ్డుగ మారుతుంది. పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్లినప్పుడు ఈ పరిస్థితి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఈ సమస్యకు మన రిఫ్రిజిరేటర్లలో లభ్యమయ్యే ఐస్‌ క్యూబ్స్‌ చక్కటి పరిష్కారం చూపిస్తాయి.

  • Publish Date - May 12, 2024 / 12:00 PM IST

Beauty Tips : అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. అందుకోసం ప్రతి ఒక్కరూ రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది అందంగా కనిపంచడం కోసం మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ప్రతి బ్యూటీ ప్రొడక్టును వాడుతుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వేసవిలో మాత్రం బయటికి వెళ్తే చెమటపట్టి ముఖం జిడ్డుగ మారుతుంది. పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్లినప్పుడు ఈ పరిస్థితి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఈ సమస్యకు మన రిఫ్రిజిరేటర్లలో లభ్యమయ్యే ఐస్‌ క్యూబ్స్‌ చక్కటి పరిష్కారం చూపిస్తాయి. మీరు కోల్పోయిన నిగారింపును మళ్లీ తీసుకొస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం ఐస్‌ క్యూబ్స్‌ ఫేషియల్ గురించి తెలుసుకుందాం…

ముందుగా ఒక పాత్ర నిండా ఐస్ వాటర్‌ను తీసుకోవాలి. అందులోనే కొన్ని ఐస్ ముక్కలను వేయాలి. ఇప్పుడు ఆ పాత్రలో ముఖాన్ని ముంచాలి. అయితే ఈ చల్లదనాన్ని అందరూ తట్టుకోలేరు. అలాంటి వాళ్లు కొన్ని ఐస్ ముక్కలను ఓ బట్టలో చుట్టి ముఖంపై మర్దన చేసుకోవాలి. దీన్నే ఐస్ ఫేషియల్ అంటారు. దీనివల్ల ముఖం ఫ్రెష్‌గా తయారవుతుంది. ఒక్కసారి ఇలా చేసి చూస్తే మార్పు మీకే అర్థమవుతుంది. సెలబ్రిటీలు సైతం ఎక్కువగా ఈ ఐస్ ఫేషియల్ చేయించునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు.

ఐస్ ముక్కలతో ఇలా చేయడం వల్ల ముఖంలో వేడి తగ్గుతుంది. శరీరంలో వచ్చే నొప్పి, మంట తగ్గుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. దీనివల్ల నిగారింపు వస్తుంది. మొటిమలతో బాధపడేవారు కూడా ఐస్ ఫేషియల్ చేసుకోవచ్చు. దీనివల్ల మొటిమలు తగ్గిపోతాయి. మొటిమలవల్ల వచ్చే వాపు కూడా తగ్గుతుంది.

అంతేగాక ఐస్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్‌తో మసాజ్ చేసుకోవడంవల్ల ఒత్తిడి, ఆందోళన లాంటివి కూడా దూరమవుతా యి. నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఐస్ ఫేషియల్‌ చేసుకోవడం వల్ల ప్రశాంతంగా నిద్రపోవచ్చు. రాత్రి పడుకునే ముందు ఈ ఐస్ ఫేషియల్ చేసుకోవడంవల్ల శరీరానికి మంచి రిలాక్సేషన్‌ లభిస్తుంది.

Latest News