Skin Care | చలికాలంలో మీ చర్మాన్ని రక్షించుకోవడానికి మంచి టిప్స్..

చలికాలం ప్రారంభమైన వెంటనే చర్మంపై ప్రభావం అనేది చాలామంది ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారిగా ముఖం బిగుసుకుపోయినట్లు అనిపించడం, మసకగా కనిపించడం, చిన్న చిన్న ఇరిటేషన్‌లు రావడం సహజమే. ఈ సమస్యలకు కొన్ని టిప్స్ పాటిస్తే మీ చర్మానికి ఉపయోగపడుతుంది.

చలికాలం ప్రారంభమైన వెంటనే చర్మంపై ప్రభావం అనేది చాలామంది ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. మొదటి వారం అంతా సరిగానే ఉన్నట్లు అనిపించినా, ఒక్కసారిగా ముఖం బిగుసుకుపోయినట్లు అనిపించడం, మసకగా కనిపించడం, చిన్న చిన్న ఇరిటేషన్‌లు రావడం సహజమే. బయట చలి గాలి తేమను తగ్గిస్తే, ఇంట్లో ఉపయోగించే హీటర్లు మరోవైపు చర్మంలోని తేమను పూర్తిగా దెబ్బతీస్తాయి. ఈ రెండు పరిస్థితులు కలిసి చర్మాన్ని మరింతగా పొడిబారేలా చేస్తాయి. ముఖ్యంగా ముఖాన్ని కడిగిన తర్వాత వచ్చే టైట్ ఫీలింగ్ చాలామంది పట్టించుకోరు. ఇది మీరు వాడే క్లెన్సర్ చర్మానికి అతిగా కఠినంగా పనిచేస్తుందనే సూచిక. ఈ సమయంలో మృదువైన క్లెన్సర్‌కు మారడం, గోరువెచ్చని నీటితోనే ముఖం కడగడం చాలా ముఖ్యం. వేడి నీరు మంచిదనిపించినా, అది చర్మం సహజసిద్ధంగా కలిగిన తేమను పోగొట్టే గుణం కలిగి ఉంటుంది.

చలికాలంలో చర్మానికి అదనపు సంరక్షణ అవసరం అవుతుంది. తేలికపాటి హైడ్రేటింగ్ సీరమ్ లేదా ఎసెన్స్‌తో ప్రారంభించి, ఆ తేమను మీ చర్మ రకానికి తగ్గ మాయిశ్చరైజర్‌ రుద్దడం ఉత్తమ పద్ధతి. డ్రై స్కిన్ ఉన్నవారు మందపాటి క్రీములు ఎంపిక చేసుకోవాలి. ఆయిలీ స్కిన్ ఉన్నవారు జెల్ ఆధారిత తేలికపాటి క్రీములను ఉపయోగిస్తే బాగుంటుంది. సున్నితమైన చర్మం ఉన్నవారు సువాసనలేని సింపుల్ ఫార్ములాలను ఉపయోగించడం మంచిది. రాత్రి పడుకునే ముందు కొంచెం రిచ్ మాయిశ్చరైజర్ వాడితే మరుసటి ఉదయం చర్మం ఆరోగ్యంగా, తేమగా కనిపిస్తుంది.

చలికాలంలో సన్‌స్క్రీన్ అవసరం లేదని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది పెద్ద అపోహ మాత్రమే. ఎండ లేకున్నా కూడా UV కిరణాలు చర్మంపై ప్రభావం చూపుతాయి. సన్‌స్క్రీన్ మానేయగానే చర్మం ప్యాచ్‌లు ఏర్పడటం, రంగు తగ్గటం, సెన్సిటివిటీ పెరగడం వంటి సమస్యలు మొదలవుతాయి. అందుకే ప్రతి ఉదయం బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ తప్పనిసరిగా వాడాలి. ఇదే విధంగా పెదవులు, చేతులు ఈ సీజన్‌లో అత్యంత వేగంగా పొడిబారతాయి. కావున లిప్ బామ్‌ను దగ్గర ఉంచుకోవడం, చేతులు కడిగిన వెంటనే హ్యాండ్ క్రీమ్ అప్లై చేయడం చర్మ సమస్యల నుంచి రక్షిస్తుంది.

చలికాలంలో అతిగా ఎక్స్‌ఫోలియేషన్ చేయడం మరో తప్పు.. వారంలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తేలికపాటి ఎక్స్‌ఫోలియంట్లు ఉపయోగించాలి. మొత్తం మీద, సాఫ్ట్ క్లెన్సింగ్ నుంచి సరైన మాయిశ్చరైజర్ వరకు క్రమబద్ధమైన సంరక్షణ పాటిస్తే చలికాలం చర్మంపై చూపే ప్రతికూల ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా ఉంచడమే కాకుండా సీజన్ మొత్తం సమస్యల నుంచి దూరంగా ఉండేలా చేస్తాయి.

Latest News