Hair fall | మీ జుట్టు విపరీతంగా రాలుతోందా.. ఈ టిప్స్‌తో సమస్యకు చెక్‌ పెట్టండి..!

Hair fall : మారిన ఆహారపు అలవాట్లు, ఉరుకులు పరుగుల జీవితాలు, మానసిక ఒత్తిళ్లు, అనారోగ్యం తదితర కారణాలవల్ల ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ జుట్టు రాలే సమస్య తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. దాంతో జుట్టు మరింత ఎక్కువగా రాలిపోయే ప్రమాదం ఉంది. ఇలా జుట్టు రాలకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం..

  • Publish Date - May 22, 2024 / 08:30 PM IST

Hair fall : మారిన ఆహారపు అలవాట్లు, ఉరుకులు పరుగుల జీవితాలు, మానసిక ఒత్తిళ్లు, అనారోగ్యం తదితర కారణాలవల్ల ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ జుట్టు రాలే సమస్య తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. దాంతో జుట్టు మరింత ఎక్కువగా రాలిపోయే ప్రమాదం ఉంది. ఇలా జుట్టు రాలకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం..

చిట్కాలు..

  • ప‌చ్చి కొబ్బరిని ముక్కలుగా కోసి మిక్సీ ప‌ట్టాలి. ఆ మిశ్రమాన్ని శుభ్రమైన వ‌స్త్రంలో వేసి కొబ్బరిపాలు వ‌చ్చేలా బాగా పిండాలి. ఇలా తీసిన కొబ్బరి పాల‌ను త‌ల‌కు ప‌ట్టించాలి. తర్వాత 20 నిమిషాలు ఆగి షాంపూతో త‌ల‌స్నానం చేయాలి. ఇలా త‌ర‌చూ చేస్తుంటే వెంట్రుక‌లు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
  • అదేవిధంగా క‌ల‌బంద గుజ్జు కూడా జట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. కలబంద గుజ్జును త‌ల‌కు బాగా ప‌ట్టించి 15 నిమిషాలు ఆగి స్నానం చేయాలి. దాంతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. వెంట్రుక‌లు రాల‌డం త‌గ్గుతుంది.
  • ఒక పాత్రలో కొద్దిగా నీళ్లు తీసుకుని, అందులో కొన్ని వేపాకులు వేసి బాగా మ‌రిగించాలి. నీరు స‌గం అయ్యేవ‌ర‌కు మ‌రిగిన తర్వాత ఆ నీటిని పూర్తిగా చ‌ల్లార్చి తలకు ప‌ట్టించాలి. కొంత‌సేప‌టికి త‌ల‌స్నానం చేయాలి. దాంతో జుట్టు రాల‌డం స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇలా వారంలో క‌నీసం రెండు సార్లు చేయాలి.
  • ప‌చ్చి ఉసిరి కాయ‌ల‌ను సేకరించి, వాటి గుజ్జు తీసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ గుజ్జు నుంచి ర‌సం తీసి, దానికి కొద్దిగా నిమ్మర‌సం క‌లిపి జుట్టుకు ప‌ట్టించాలి. కొంత సేప‌టికి త‌ల‌స్నానం చేయాలి. ఇలా త‌ర‌చూ చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
  • రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక నిమ్మకాయ నుంచి తీసిన రసం మూడిటింని బాగా క‌లిపి, ఈ మిశ్రమాన్ని త‌ల‌కు ప‌ట్టించాలి. 30 నిమిషాలు ఆగాక త‌ల‌స్నానం చేయాలి. దాంతో జుట్టు రాల‌డం త‌గ్గి వెంట్రుక‌లు బాగా పెరుగుతాయి. ఇలా త‌ర‌చూ చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.
  • రెండు టేబుల్ స్పూన్ల మెంతుల‌ను నీటిలో రాత్రంతా నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే ఆ మెంతుల‌ను తీసి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్టును నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగుకు క‌ల‌పాలి. అందులో ఒక గుడ్డు తెల్లసొన‌ను క‌ల‌పాలి. అనంత‌రం ఈ మిశ్రమాన్ని త‌ల‌కు ప‌ట్టించి 30 నిమిషాలు ఆగాక త‌ల‌స్నానం చేయాలి. ఇలా త‌ర‌చూ చేస్తే జుట్టు రాల‌డం త‌గ్గుతుంది.
  • ఒక ఉల్లిపాయ‌ను మిక్సీ ప‌ట్టి ర‌సం తీయాలి. ఆ ర‌సాన్ని జుట్టుకు బాగా ప‌ట్టించాలి. 30 నిమిషాలు ఆగాక త‌ల‌స్నానం చేయాలి. దాంతో జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. త‌ర‌చూ ఇలా చేస్తే ఈ స‌మ‌స్య నుంచి శాశ్వతంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.
  • కొద్దిగా కొబ్బరినూనె తీసుకుని, అందులో కొన్ని మందార‌పూలు వేసి బాగా మ‌ర‌గ‌బెట్టాలి. మందార‌పూలు పూర్తిగా న‌లుపు రంగులోకి మారాక ఆయిల్‌ను సేక‌రించాలి. ఆ నూనెను చ‌ల్లార్చి త‌ల‌కు ప‌ట్టించి కొంత సేపు ఆగాక తలస్నానం చేయాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది.
  • కొంచెం కొబ్బరినూనెను తీసుకుని గోరు వెచ్చగా అయ్యేలా వేడి చేయాలి. తర్వాత ఆ ఆయిల్‌ను త‌ల‌కు ప‌ట్టించి 30 నిమిషాలు ఆగి క‌డిగేయాలి. ఇలా త‌ర‌చూ చేస్తే జుట్టు రాల‌డం ఆగిపోతుంది.
  • రెండు కోడిగుడ్లను ప‌గ‌ల‌గొట్టి తెల్లసొన సేకరించి దాన్ని త‌ల‌కు ప‌ట్టించాలి. 20 నిమిషాలు ఆగాక షాంపూతో స్నానం చేయాలి. లేదంటే ఒక కోడిగుడ్డును ప‌గ‌ల‌గొట్టి తెల్లసొన సేక‌రించి, అందులో ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్‌ను కలుపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని త‌ల‌కు ప‌ట్టించి, 20 నిమిషాలు ఆగి స్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తే వెంట్రుక‌లు రాల‌డం త‌గ్గుతుంది.
  • ఆలుగడ్డల పొట్టు తీసేసి మెత్తని మిశ్రమంగా మిక్సీ ప‌ట్టుకోవాలి. అందులో ఒక టీస్పూన్ తేనె, కొంత నీరు క‌లిపి మిశ్రమంగా చేసుకోవాలి. తర్వాత దాన్ని త‌ల‌కు ప‌ట్టించి 30 నిమిషాలు ఆగాక స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది.
  • ఒక క‌ప్పు గోరు వెచ్చని నీటిలో 2, 3 టీస్పూన్ల నిమ్మర‌సం వేసి బాగా క‌లిపి ఆ మిశ్రమాన్ని త‌ల‌కు ప‌ట్టించి 30 నిమిషాలు ఆగాక త‌ల‌స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే వెంట్రుక‌లు రాలిపోకుండా ఉంటాయి.
  • స‌న్నగా త‌రిగిన కొత్తిమీరను మిక్సీలో ప‌ట్టి జ్యూస్‌గా చేసి అందులో అవ‌స‌రం అనుకుంటే కొంత నీరు క‌లిపి ఆ మిశ్రమాన్ని జుట్టుకు బాగా ప‌ట్టించాలి. త‌ర్వాత కొంత సేపు అలాగే ఉండి త‌ల‌స్నానం చేయాలి. దాంతో జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌చ్చు.

Latest News