బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై క్రిమిన‌ల్ కేసు న‌మోదు

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బంజారాహిల్స్ పోలీసు స్టేష‌న్‌లో క్రిమిన‌ల్ కేసు న‌మోదైంది. తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి రూ. 2,500 కోట్లు పంపార‌ని కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే

  • Publish Date - March 30, 2024 / 05:52 AM IST

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బంజారాహిల్స్ పోలీసు స్టేష‌న్‌లో క్రిమిన‌ల్ కేసు న‌మోదైంది. తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి రూ. 2,500 కోట్లు పంపార‌ని కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ నేత‌లు హ‌నుమ‌కొండ పోలీసు స్టేష‌న్‌లో కేటీఆర్‌పై కాంగ్రెస్ నేత బ‌త్తిన శ్రీనివాస్ రావు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కేసును హ‌నుమ‌కొండ నుంచి బంజారాహిల్స్ పీఎస్‌కు పంపారు. ఈ క్ర‌మంలో కేటీఆర్‌పై ఐపీసీ 504, 505(2) సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు.


మున్సిపల్‌ శాఖను తన వద్దనే ఉంచుకున్న సీఎం రేవంత్‌రెడ్డి మూడు నెలలుగా డబ్బులిస్తేనే బిల్డింగులకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. అలా వసూలు చేసిన రూ.2,500 కోట్లను ఢిల్లీకి పంపారు. ఓవైపు ఇసుక దందా, రైస్‌ మిల్లర్లను, మరోవైపు బిల్డర్లు, రియల్టర్లను బెదిరిస్తూ డబ్బు వసూలు చేస్తున్నారు. కత్తెర పెట్టుకుని జేబు దొంగలా తిరుగుతున్నారు అని ఇటీవ‌ల నిర్వ‌హించిన బీఆర్ఎస్ స‌మావేశాల్ల‌లో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే.

Latest News