Site icon vidhaatha

Hyderabad | హైద‌రాబాద్‌లో విషాదం.. కుమార్తెల‌కు నిద్ర మాత్రలిచ్చి తండ్రి సూసైడ్

Hyderabad | హైద‌రాబాద్ : హైద‌రాబాద్‌లో విషాదం నెల‌కొంది. బోయిన్‌ప‌ల్లి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని భ‌వానీ న‌గ‌ర్‌లో విషాదం నెల‌కొంది. కుటుంబ క‌ల‌హాల‌తో ఓ వ్య‌క్తి త‌న ఇద్ద‌రు కుమార్తెల‌కు నిద్ర మాత్ర‌లు ఇచ్చి చంపేశాడు. అనంత‌రం ఆ పిల్ల‌ల తండ్రి కూడా నిద్ర‌మాత్ర‌లు మింగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.

కుటుంబ స‌భ్యులు, స్థానికులు అందించిన స‌మాచారంతో పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల‌ను శ్రీకాంత్, శ్రావ్య‌(7), స్ర‌వంతి(8)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుల కుటుంబ స‌భ్యులు, బంధువులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

Exit mobile version