Woman Saree | ప్రపంచ వస్త్రధారణలో చీర ఓ ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచానికి చీర అందాన్ని పరిచయం చేసిన ఘనత భారతదేశానిదే అని చెప్పొచ్చు. ఎందుకంటే భారతీయ మహిళలు చీర కడితే కుందనపు బొమ్మలా కనిపిస్తారు. ఎంతో సౌందర్యంగా మెరుస్తూ.. మైమరిపిస్తారు. అలాంటి చీరకట్టును ఇప్పుడు విదేశీయులు కూడా ఇష్టపడుతున్నారు. విదేశీ మహిళలు కూడా చీర మోజులో పడిపోయారు. అయితే మగువలు చీర కడితే ఇష్టపడే మగాళ్లు ఈ భూమ్మీద చాలానే ఉన్నారు. స్త్రీలు చీరకట్టులోనే అందంగా ఉంటారు. కాబట్టి మగువలు చీర ధరిస్తే మగాళ్లకు ఏదో తెలియని అనుభూతి, ఆనందం కలుగుతుందట.
- పండుగలు, ఫంక్షన్లు జరిగినప్పుడు మహిళలు, యువతులు చీరలు ధరిస్తుంటారు. ఆ సమయాల్లో వారిని పురుషులు తదేకంగా చూస్తుంటారు. అంటే స్త్రీలు అంత అందంగా కనిపిస్తారు మరి.
- మహిళలు చీరలు రెగ్యులర్‌గా ధరించినప్పటికీ.. ఒక్కో చీరలో ఒక్కో లుక్‌లో కనిపిస్తారు. ఆ అందాన్ని చూసి మగాళ్లు తన్మయత్వం చెందుతారు.
- స్త్రీలు చీరలు కాకుండా ఇతర దుస్తులు ధరించినప్పుడు అంత అందంగా కనిపించరు. చీరకట్టులో అందాలను ఒలకబోస్తూ.. వయ్యారాలతో పురుషులను మైమరిపిస్తారు. కాబట్టి చీరకట్టే మహిళలను మగాళ్లు ఇష్టపడుతారట.
- అబ్బాయిలు కూడా తమ లవర్స్‌ను చీర ధరించినప్పుడు చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతారట. అందుకే తమ ప్రియురాళ్లను చీరలు ధరించమని ప్రాధేయపడుతారట.
- అంతే కాదు చీరల్లో ఆడవారు చాలా మెచ్యూర్‌గా కనిపిస్తారట. వారి బాడీ లాంగ్వేజ్ కూడా ఎలివేట్ అవుతుందట. కాబట్టి మగవారికి ఆడవారు చీరలు ధరిస్తేనే ఇష్టమట.
- చీరల్లో ఆడవారు మెచ్యూర్‌గా కనిపిస్తారు. అప్పటి వరకూ ఉన్న పిల్లతనం పోయి వారు పూర్తిగా స్త్రీలలాగా కనిపిస్తారు. వారి బాడీ లాంగ్వేజ్‌ని ఎలివేట్ చేస్తారు. కాబట్టి, మగవారికి చాలా ఇష్టం.