టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో అందరి అటెన్షన్ తన వైపుకి తిప్పుకున్నాడు. ఒకవైపు వైవిధ్యమైన సినిమాలు చేస్తూనే మరోవైపు పలు వివాదాలతో వార్తలలో నిలుస్తూ వస్తున్నాడు. అయితే విశ్వక్ ఎప్పుడు సక్సెస్ వెనక పరుగెత్తకుండా విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేయాలని కష్టపడుతున్నాడు. తన ప్రతి సినిమాలోను సరికొత్తగా కనిపించి ప్రేక్షకులకి సరికొత్త థ్రల్ అందిస్తుంటాడు. ‘ఈ నగరానికి ఏమైంది?’ మూవీతో స్టార్ట్ అయిన విశ్వక్ సేన్ జర్నీ ప్రస్తుతం నిలకడగానే కొనసాగుతోంది.
నటుడిగా, డైరెక్టర్ గా, ఇప్పుడు నిర్మాతగా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ వస్తున్నారు. విశ్వక్ సేన్ ఇటీవల కల్డ్ అనే మూవీని నిర్మిస్తున్న ప్రకటించిన విషయం తెలిసిందే. రీసెంట్‌గా మూవీ లాంచ్ వేడుక గ్రాండ్ జరగగా, ఈ కార్యక్రమంలో విశ్వక్ సేన్ తన పెళ్లికి సంబంధించిన వార్తలపై స్పందించాడు. గతంలో తన పెళ్లిపై పలు వార్తలు వచ్చాయి. అయితే అవి తన సినిమా ప్రమోషన్స్ కోసం అని తర్వాత తేలిపోయింది. ఇక తాజాగా మాత్రం తన పెళ్లిపై ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. మీ పెళ్లి ఎప్పుడు ఉంటుందని అడిగి ప్రశ్నకు సరదాగా బదులిచ్చారు.
‘పెళ్లికి బడ్జెట్ లేదు. ఆర్య సమాజ్ కి వెళ్లి పెళ్లి చేసుకుంటాను. అయితే త్వరలోనే పెళ్లి ఉంటుంది. లేదంటే ఐదారు ఏళ్లు పడుతుందని’ సరదాగా సమాధానం ఇచ్చారు విశ్వక్. మరి ఆయన చెప్పినట్టు త్వరగా జరిగితే మంచిది, లేదంటే ఐదారేళ్లు ఆగక తప్పదేమో. ఇక ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ శివరాత్రికి రాబోతుందని తెలియజేశారు విశ్వక్. డిసెంబర్ 7కే రావాల్సిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ పలు కారణాల వలన వాయిదా పడింది. ఇక VS10, గామీ అనే చిత్రాల్లోనూ నటిస్తూ విశ్వక్ సేన్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అవి షూటింగ్ దశలో ఉండగా, అవి కూడా ప్రేక్షకులని అలరించే విధంగా ఉంటాయట.