విధాత: రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని అంటున్న బీజేపీకి మరో షాక్ తగలనున్నదా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. నిజమైన ఉద్యమకారులకు బీజేపీ నే వేదిక అవుతున్నదన్న ఆ పార్టీ నేతల ప్రచారం అసత్యమని తేలనున్నదా? అంటే నిజమే అంటున్నారు.
బీజేపీలో చేరక ముందు టీఆర్ఎస్‌లో గాని, కాంగ్రెస్ పార్టీలో గాని గౌరవ ప్రదంగా ఉండే నేతలు, నిత్యం రాజకీయ డిబేట్లలో కనిపించే వారు కాషాయ తీర్థం పుచ్చుకున్నాక ఎక్కడా కనిపించకుండా ఉండే పరిస్థితలు ఉన్నాన్నది ఆ పార్టీని వీడుతున్న నేతల వ్యాఖ్యలను బట్టి తెలుస్తున్నది.
ఉద్యమకారులను ఉద్యమపార్టీని విమర్శించడానికే తప్పా పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం కుదరదు అన్నది ఆ పార్టీలో చేరి తిరిగి అసంతృప్తితో సొంత గూటికి చేరుతున్న నేతల మాటలు దానికి అద్దం పడుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న దాసోస్ శ్రవణ్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీలో చేర్చుకోవడానికి ఆయనకు ఏమ హామీ ఇచ్చారో తెలియదు. కానీ ఆయన బీజేపీలో చేరిన తర్వాత ఎక్కడా కనిపించడం లేదు. టీఆర్ఎస్‌లో ఉన్నన్ని రోజులు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులు దాసోజు శ్రవణ్ నిత్యం టీవీ చర్చల్లో కనిపించేవారు. చాలా మంచి వక్త అయిన ఆయన కాషాయ పార్టీలోకి వెళ్లగానే సైలెంట్ అయ్యారు.
గతంలో బీజేపీలో పనిచేసిన ఆయన ప్రస్తుతం ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు నచ్చడం లేదని సమాచారం. నేతలు చెబుతున్నది ఒకటి చేస్తున్నది ఒకటి అన్నది నిన్న బూడిద భిక్షమయ్య చెప్పారు. దీంతో దాసోజు శ్రావణ్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఆయన సాయంత్రం ఆయన కారెక్కనున్నారని సమాచారం. అలాగే స్వామిగౌడ్ కూడా మండలి ఛైర్మన్ చేసిన ఘనత టీఆర్ఎస్‌ది.
ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఆయన పార్టీ వీడారు. అప్పటి నుంచి ఆయన అడపాదడపా కనిపిస్తున్నా ఆయన సేవలను పార్టీ పూర్తిగా ఉపయోగించుకుంటున్నట్లు గాని ఆయన కు తగిన ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపించడం లేదు. దీంతో ఆయనతో కూడా టీఆర్ఎస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
అన్ని కుదిరితే స్వామి గౌడ్ కూడా తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరడం ఖాయం అంటున్నారు. ఇదే జరిగితే బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం సంగతి పక్కపెడితే అసలు ఆ పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు వెళ్తారో తెలియని అమోయమం నెలకొనే పరిస్థితులు తలెత్తవచ్చు అంటున్నారు.