Site icon vidhaatha

ఏప్రిల్‌ నెల‌లో పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్నారా..? శుభ ముహుర్తాలు ఈ ఐదు రోజులే..!

అమ్మాయి కానీ, అబ్బాయికి కానీ ఒక వ‌య‌సు రాగానే.. త‌ల్లిదండ్రులు వారికి పెళ్లి చేసేందుకు రెడీ అవుతుంటారు. ఇందుకోసం స‌రైన అమ్మాయి, అబ్బాయి కోసం వెతుకుతుంటారు. మంచి సంబంధం వ‌చ్చి, అమ్మాయి – అబ్బాయి న‌చ్చుకుంటే పెళ్లి తంతు ప్రారంభిస్తారు. క‌ట్న‌కానుక‌లు నిర్ణ‌యించిన మ‌రుక్ష‌ణ‌మే నిశ్చితార్థం, వివాహ తేదీల‌ను సెట్ చేసుకుంటారు. అయితే ఆ జంట నిండు నూరేండ్లు సుఖ‌సంతోషాల‌తో, పిల్లాపాప‌ల‌తో వ‌ర్ధిల్లాల‌నే ఉద్దేశంతో.. నిశ్చితార్థం, వివాహల‌ను శుభ ముహుర్తంలోనే చేసేందుకు పెద్ద‌లు ఇష్ట‌ప‌డుతుంటారు. ఎప్పుడంటే ఎప్పుడు, ఎక్క‌డంటే ఎక్క‌డ పెళ్లిళ్ల‌ను చేయ‌రు. కాబ‌ట్టి జ్యోతిష్య పండితుల‌ను సంప్ర‌దించి ఎంగేజ్‌మెంట్, మ్యారేజ్ డేట్స్‌ను నిర్ణ‌యిస్తుంటారు. అమ్మాయి, అబ్బాయి జాత‌కాల ప్ర‌కారం పండితులు కూడా నిశ్చితార్థం, వివాహ తేదీల‌ను నిర్ణయిస్తుంటారు. కాబ‌ట్టి చాలా మంది ఈ తేదీల‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇస్తారు.

ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగ అయిపోయిన త‌ర్వాత ప్ర‌తి నెల‌లో పెళ్లిళ్లు బాగానే జ‌రిగాయి. మార్చి నెల‌లో కూడా దాదాపు 10, 15 శుభ‌ముహుర్తాలు ఉండే. ఆ ముహుర్తాల్లో కొన్ని వేల జంట‌ల‌కు పెళ్లిళ్లు అయ్యాయి. ఇక ఏప్రిల్ నెల‌లో కూడా వివాహాలు చేసేందుకు ముహుర్తాల‌ను చూసుకుంటున్నారు. ఏప్రిల్ 9(ఉగాది) త‌ర్వాతే మంచి ముహుర్తాలు ఉన్న‌ట్లు పండితులు చెబుతున్నారు. ఇక ఆదివారంతో మార్చి నెల ముగియ‌నుంది. సోమ‌వారం నుంచి ఏప్రిల్ నెల ముగిసేదాకా.. కేవ‌లం ఐదు రోజులు మాత్ర‌మే వివాహాల‌కు అనుకూలంగా ఉన్నాయి. మ‌రి ఆ అనుకూల, ఉత్త‌మ‌మైన వివాహా తేదీలు ఏవో చూసేద్దాం..

ఏప్రిల్‌లో శుభ ముహుర్తాలు ఇవే..

ఏప్రిల్ 18 (గురువారం) – అర్ధ‌రాత్రి 12:44 నుంచి ఏప్రిల్ 19న ఉద‌యం 5:51 గంట‌ల వ‌ర‌కు

ఏప్రిల్ 19 (శుక్ర‌వారం) – ఉద‌యం 5:41 నుంచి 6:46 వ‌ర‌కు

ఏప్రిల్ 20 (శ‌నివారం) – మ‌ధ్యాహ్నం 2:04 గంట‌ల నుంచి ఏప్రిల్ 21న తెల్ల‌వారుజామున 2:48 వ‌ర‌కు

ఏప్రిల్ 21 (ఆదివారం) – అర్ధ‌రాత్రి 3:45 గంట‌ల నుంచి ఏప్రిల్ 22న ఉద‌యం 5:48 గంట‌ల వ‌ర‌కు

ఏప్రిల్ 22 (సోమ‌వారం) – ఉద‌యం 5:48 నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు  

Exit mobile version