Site icon vidhaatha

నేడే తొలి సెమీస్.. ఆ ఒక్క‌టే మ్యాచ్‌ని డిసైడ్ చేస్తుందంటున్న విశ్లేష‌కులు

వ‌న్డే వ‌ర‌ల్డ్ కప్ 2023 సెమీస్ ద‌శ‌కి చేరింది. నేడు న్యూజిలాండ్-భార‌త్ మ‌ధ్య తొలి సెమీస్ జ‌ర‌గ‌నుండ‌గా, ఈ మ్యాచ్‌లో ఎవ‌రు గెలిచి సెమీస్ చేరుకుంటార‌ని ప్ర‌తి ఒక్క‌రు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. అయితే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అన్ని టీమ్‌ల‌పై గెలిచి అద్భుతం చేసిన భార‌త్ ఇప్పుడు మ‌రోసారి న్యూజిలాండ్ తో పోటీ ప‌డ‌నుంది. ఐసీసీ టోర్నీల్లో టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారిన న్యూజిల్యాండ్‌ను భార‌త్ ఓడించాలంటే కివీస్ జట్టులోని ఈ మూడు బలహీనతలపై భార‌త్ దెబ్బ‌కొట్టాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం కివీస్ జ‌ట్టులో ర‌చిన్ ర‌వీంద్ర అద్భుతంగా ఆడుతున్నాడు. రీఎంట్రీ ఇచ్చిన విలియమ్సన్ అసలు గాయం నుంచి తిరిగొచ్చినట్టు క‌నిపించ‌కుండా బ్యాటింగ్‌తో అద్భుతాలు చేస్తున్నాడు.

ఇక కివీస్ మిడిలార్డ‌ర్‌లో టామ్ లాథమ్, డారియల్ మిచెల్ స్పిన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. ఇప్పటికే మిచెల్ భారత్‌పై సెంచ‌రీ చేశాడు. గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసం సృష్టించగలడు. న్యూజిలాండ్ జట్టు ఎక్కువగా వీరిపైనే ఆధార‌ప‌డుతుండ‌గా, వారిని క‌ట్టడి చేస్తే భార‌త్‌కి విజ‌యావ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. మ‌రోవైపు భార‌త బ్యాట్స్‌మెన్స్ శాంట్న‌ర్‌తో పాటు బౌల్ట్‌ని స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కోవ‌ల‌సి ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ ఫలితాన్ని ఫస్ట్ పవర్ ప్లేనే . టాస్ ప్రభావం పెద్దగా ఉండకపోయినా.. తొలి 10 ఓవర్ల ఆటనే మ్యాచ్ కి కీలకంగా మారనుంది. ముఖ్యంగా టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వస్తే.. ఓపెనర్లు శుభారంభం అందించడం కీలకంగా మారుతుంది..

కొత్త బంతితో స్వింగ్ చేసే డేంజరస్ ట్రెంట్ బౌల్ట్‌ను ఎదుర్కోవడం చాలా కీలకం. రోహిత్ శర్మ రాణిస్తే.. మిడిల్ ఓవర్లలో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కి సులువు అవుతుంది. ఓపెన‌ర్స్ ఈ మ్యాచ్‌లో కాస్త జాగ్ర‌త్త‌గా దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. మ‌రోవైపు తొలుత బౌలింగ్ చేయాల్సి వస్తే జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ పవర్ ప్లేలో తీసే వికెట్లు, న్యూజిలాండ్ స్కోరును డిసైడ్ చేస్తాయి. ముఖ్యంగా సెమీస్‌లో టీమిండియా ఇటీవలి కాలంలో తడబడటం మ‌నందరం చూస్తున్నాం. కివీస్ ప‌రిస్థితి కూడా అలానే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు 13 వరల్డ్ కప్‌లలో కివీస్ ఇలా సెమీస్ చేరడం ఇది తొమ్మిదోసారి కావడం గమనార్హం.

Exit mobile version