Site icon vidhaatha

నిరుద్యోగులు వినాయ‌కుడిని ఈ ఆకుల‌తో పూజిస్తే మంచిది.. ఎందుకంటే..?

హిందువులు ఏ శుభకార్యం ప్రారంభించినా మొద‌ట‌గా గ‌ణ‌నాథుడిని పూజిస్తారు. ఆ త‌ర్వాతే మిగ‌తా కార్య‌క్ర‌మాలు ప్రారంభిస్తారు. ప్రారంభించే ప‌ని విజ‌య‌వంతం కావాల‌ని, విఘ్నాల‌న్నీ తొల‌గిపోవాల‌ని వినాయ‌కుడిని పూజిస్తారు. మ‌రి నిరుద్యోగులు కూడా వినాయ‌కుడిని పూజిస్తే మంచి ఫ‌లితాలు ఉంటాయ‌ని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. వినాయ‌క చ‌వితి అప్పుడు చాలా మంది ఆ గ‌ణ‌నాథుడి ముందు పుస్త‌కాలు ఉంచి త‌మ‌కు గొప్ప విద్య‌ను, తెలివిని ప్ర‌సాదించాల‌ని కోరుకుంటారు. మ‌రి నిరుద్యోగులు ఈ ఆకుల‌తో పూజిస్తే మంచి జ‌రుగుతుంద‌ని పేర్కొంటున్నారు. మ‌రి ఆ ఆకులు ఏంటో తెలుసుకుందామా..?

నిరుద్యోగులు ఈ ఆకుల‌తో..

ప్ర‌తి బుధ‌వారం ఉద‌యం లేవ‌గానే నిరుద్యోగులు అభ్యంగ స్నానం చేసి, వినాయ‌కుడి ఆల‌యానికి వెళ్లాల‌ని పండితులు సూచిస్తున్నారు. ఇక గ‌న్నేరు ఆకుల‌తో వినాయ‌కుడిని పూజించాల‌ని చెబుతున్నారు. “వికాత్య నమః” అనే మంత్రాన్ని జపిస్తూ 5 గన్నేరు ఆకులను గ‌ణ‌నాథుడికి స‌మ‌ర్పించాలి. దీంతో మీకు గణపతి ఆశీస్సులు లభించడమే కాకుండా ఉద్యోగం పొందే మార్గంలో ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోతాయట. కాబ‌ట్టి ప్ర‌తి బుధ‌వారం వినాయ‌కుడిని ఆరాధించి మీ క‌ల‌ల‌ను సాకారం చేసుకోండి.

ఆర్థిక క‌ష్టాలు తొల‌గిపోవాలంటే..

ఆర్థిక క‌ష్టాల‌తో బాధ‌ప‌డేవారు కూడా వినాయ‌కుడిని పూజిస్తే మేలు జ‌రుగుతుంద‌ట‌. లంబోద‌రుడికి 9 జిల్లేడు ప‌త్రాల‌ను స‌మ‌ర్పిస్తే.. ఉత్త‌మ ఫ‌లితాల‌ను పొందొచ్చ‌ని పండితులు చెబుతున్నారు. ఈ పూజా స‌మ‌యంలో “వినాయక నమః” అనే మంత్రాన్ని పఠిస్తూ ఈ ఆకులను స్వామి వారికి సమర్పించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయని చెబుతున్నారు.

ఆరోగ్య స‌మ‌స్య‌లు మాయం..

ఆరోగ్య స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డేవారు అర్జున చెట్టు ఆకుల‌తో పూజిస్తే.. మంచిద‌ని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ప‌ద‌కొండు అర్జున ఆకుల‌తో వినాయ‌కుడిని పూజిస్తే, స్వామివారి అనుగ్ర‌హం ల‌భించి రోగాలు న‌యం అయ్యే అవ‌కాశం ఉంద‌న్నారు. మ‌ర్రి ఆకుల మాదిరిగా ఉండే మ‌ద్ది చెట్టు ఆకుల‌నే అర్జున ప‌త్రాలంటారు. “కపిలాయ నమః” అనే మంత్రాన్ని పఠిస్తూ ఈ ఆకులను సమర్పించాలి.

Exit mobile version