Site icon vidhaatha

మ‌హేష్ బాబు ఖాళీ స‌మ‌యంలో ఏం చేస్తాడో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌డం ఖాయం..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒక‌రు అనే విష‌యం తెలిసిందే. ఆయ‌న ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రోవైపు మ‌హేష్ బాబు త్వ‌ర‌లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో క‌లిసి పాన్ ఇండియా చిత్రం చేయ‌నున్నాడు. ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి.ఈ సినిమాతో మహేష్‌కి గ్లోబల్ ఇమేజ్ ద‌క్క‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న ఫ్యాన్స్ డిసైడ్ అవుతున్నారు.అయితే మ‌హేష్ బాబు న‌టుడిగానే కాకుండా మంచి మ‌న‌సున్న మ‌నిషిగా ఎంద‌రో మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు.

చిన్న పిల్లలకు కష్టం వస్తే చూడలేని మ‌హేష్ బాబు వారి కోసం సొంత డ‌బ్బు ఖ‌ర్చు పెట్టి వైద్యం చేయించారు. ఎంతో మంది చిన్నారుల‌కి గుండె ఆప‌రేష‌న్స్ చేయించారు. ఇక ఇటీవ‌ల కృష్ణ వ‌ర్ధంతి సంద‌ర్భంగా తాను కొంత‌మంది పిల్ల‌ల‌ని చ‌దివిస్తాన‌ని చెప్పుకొచ్చాడు. ఇలా మంచితనం, నటన, అందం ఉన్న స్టార్ హీరో సినిమా వస్తుందంటే థియేటర్లలో ర‌చ్చ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌హేష్ బాబు సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఖాళీ దొరికితే మాత్రం ఫ్యామిలీతో విహార యాత్ర‌ల‌కి వెళుతుంటాడు. ఎంచ‌క్కా కుటుంబ స‌భ్యులతో క‌లిసి స‌ర‌దాగా గ‌డుపుతుంటాడు.

మ‌హేష్ ఖాళీ స‌మ‌యంలో విహార యాత్ర‌ల‌కి వెళ్ల‌డ‌మే కాదు ఏ మాత్రం పని లేకుండా ఖాళీగా ఉంటే ఏదో ఒక బుక్ ను చేతిలో పట్టుకొని చదువుతూ ఉంటారట. ఇంట్రెస్టింగ్ బుక్స్ చ‌దువుతూ నాలెడ్జ్ పెంచుకుంటార‌ట‌. సూపర్ స్టార్ కు ఇలాంటి అలవాటు ఉండడం గ్రేట్ అంటూ ఫ్యాన్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మ‌హేష్ బాబు ఖాళీ సమయంలో మాత్రమే కాదు జర్నీ చేసే సమయంలో కూడా ఎక్కువ‌గా పుస్తకాలు చదువుతూ ఉంటారట. ఇండ‌స్ట్రీలో మ‌హేష్ తో పాటు ప‌లువురు స్టార్ హీరోలు కూడా ఎక్కువ‌గా పుస్త‌కాలు చ‌దువుతార‌నే విష‌యం తెలిసిందే.

Exit mobile version