">

E-Passports | త్వరలో అందుబాటులోకి చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్టులు – vidhaatha " /> " />

E-Passports | త్వరలో అందుబాటులోకి చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్టులు

E-Passports | ఇండియా త్వర‌లో ఈ-పాస్‌పోర్టుల‌ను అందుబాటులోకి తేనున్నది. ఈరోజు పాస్‌పోర్ట్ దివ‌స్ సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంక‌ర్ "పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రాం 2.0" (PSP-వెర్షన్ 2.0)ను ప్రక‌టించారు. ప్రజలకు పాస్‌పోర్ట్ మరియు సంబంధిత సేవలను "సకాలంలో, సమర్ధవంతంగా అందుబాటులోకి తీసుకొస్తామ‌నే ప్రతిజ్ఞను చేప‌ట్టడంలో తనతో కలిసి రావాలని భారతదేశం మరియు విదేశాలలో పాస్‌పోర్ట్ జారీ చేసే అధికారులకు జైశంకర్ (foreign minister Jaishankar)పిలుపునిచ్చారు. "మేము త్వరలో స‌రికొత్త, ఆధునీక‌రించిన చిప్ ఆధారిత‌ ఈ-పాస్‌పోర్ట్‌ (chip-based […]

  • Publish Date - June 25, 2023 / 12:45 AM IST

E-Passports |

ఇండియా త్వర‌లో ఈ-పాస్‌పోర్టుల‌ను అందుబాటులోకి తేనున్నది. ఈరోజు పాస్‌పోర్ట్ దివ‌స్ సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంక‌ర్ “పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రాం 2.0” (PSP-వెర్షన్ 2.0)ను ప్రక‌టించారు.

ప్రజలకు పాస్‌పోర్ట్ మరియు సంబంధిత సేవలను “సకాలంలో, సమర్ధవంతంగా అందుబాటులోకి తీసుకొస్తామ‌నే ప్రతిజ్ఞను చేప‌ట్టడంలో తనతో కలిసి రావాలని భారతదేశం మరియు విదేశాలలో పాస్‌పోర్ట్ జారీ చేసే అధికారులకు జైశంకర్ (foreign minister Jaishankar)పిలుపునిచ్చారు.

“మేము త్వరలో స‌రికొత్త, ఆధునీక‌రించిన చిప్ ఆధారిత‌ ఈ-పాస్‌పోర్ట్‌ (chip-based passport)లతో సహా పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ (PSP) వెర్షన్ 2.0ని ప్రారంభించబోతున్నాము” అని జైశంకర్ తెలిపారు.

ప్ర‌జ‌ల‌కు సుల‌భ జీవ‌నం అందించాల‌నే ప్రధాన మంత్రి ఆశ‌యానికి అనుగుణంగా ఈజ్ (E: Enhanced passport services to citizens, using a digital eco-system A: Artificial Intelligence-powered service delivery S: Smoother overseas travel using chip-enabled e-passports E: Enhanced data security) అనే న‌మూనాకు ఈ కార్యక్రమం మ‌రింత‌గా ఊత‌మిస్తుంద‌ని భావిస్తున్నాన‌ని ఆయ‌న అన్నారు.

Latest News