Site icon vidhaatha

Phone Tapping Case: ప్రభాకర్ రావు రాక ఆలస్యం !

Phone Tapping Case: : ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావు హైదరాబాద్ రావడానికి మరికొన్ని రోజులు పట్టేలా కనిపిస్తుంది. వాస్తవానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వన్ టైమ్ ఎంట్రీ ట్రావెలింగ్ వీసా అందగానే ఈ నెల 5న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు బృందం సిట్ ముందుకు ప్రభాకర్ రావు వస్తారని స్వయంగా సమాచారం అందించారు. అయితే ప్రభాకర్ రావు కి వన్ టైమ్ ఎంట్రీ ట్రావెలింగ్ పాస్ పోర్టు, వీసా అందడంలో నెలకొన్న జాప్యంతో ఆయన హైదరాబాద్ ప్రయాణం వాయిదా పడింది. ఈనెల 9న ప్రభాకర్ రావు హైదరాబాద్ కు రానున్నారని సమాచారం. ప్రభాకర్ రావు 9న హైదరాబాద్ కు వచ్చిన తర్వాత 3రోజుల్లో విచారణకు హాజరుకానున్నట్లుగా తెలుస్తుంది ప్రభాకర్ రావును విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చే అవకాశముందని సిట్ భావిస్తుంది. ప్రభాకర్ రావు ఇటీవల సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా..దానిని కొట్టివేసిన న్యాయస్థానం ప్రభాకర్ రావును అరెస్టు చేయ‌వ‌ద్దంటూ ఊరటనిచ్చింది. అయితే ప్రభాకర్ రావు పాస్ పోర్టు మంజూరు చేస్తే తాను విచారణకు హాజరవుతానని కోర్టుకు అండర్ టేకింగ్ ఇచ్చారు. దీంతో వెంటనే పాస్ పోర్టు ఇవ్వాలని ప్రభుత్వాన్ని.. విచారణకు హాజరుకావాలని ప్రభాకర్ రావును ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు హైదరాబాద్‌కు వస్తున్నారు.

ఆలస్యంపై అనుమానాలు

కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పాలకులలో ఒకరైన కేటీఆర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉండడం..ప్రభాకర్ రావు ఇండియాకి తిరిగి రాకపోవడంపై పలు అనుమానాలు సైతం వినిపిస్తున్నాయి. గతంలోనూ హరీష్ రావు అమెరికా పర్యటన సందర్భంగా ప్రభాకర్ రావును కలిసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పటి సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర ఆరోపణలు చేశాయి. వారి ప్రోద్బలంతోనే..వారి రాజకీయ, ఆర్థిక అవసరాల కోణంలో ప్రతిపక్ష నేతల, వ్యాపారుల, కాంట్రాక్టర్ల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా ఆ పార్టీలు ఆరోపించాయి. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన వెంటనే ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు అమెరికా పారిపోగా..ఇటీవల శ్రవణ్ రావు ఇండియా తిరిగి వచ్చి విచారణకు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు సైతం విచారణకు వస్తానని చెప్పారు. ఆయన 14నెలలుగా అమెరికాలోనే తలదాచుకుంటున్నారు. అంతకుముందు కేసులో నిందితులుగా ఉన్న ఏసీపీలు భుజంగరావు, తిరుపతన్న, డీసీపీ రాధాకిషన్ రావు, డీఎస్పీ ప్రణిత్ రావులను సిట్ అరెస్టు చేసి వారి విచారణ నిర్వహించింది.

Exit mobile version