Site icon vidhaatha

గుంటూరు కారంపై దారుణ‌మైన ట్రోలింగ్.. సోషల్ మీడియా కుక్కలు అంటూ రామజోగ‌య్య ఫైర్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో అత‌డు, ఖ‌లేజా చిత్రాలు రూపొందగా ఈ రెండు మంచి విజ‌యాన్ని సాధించాయి. ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడో చిత్రం ఖ‌లేజా రూపొందుతుంది. ‘గుంటూరు కారం’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతికి విడుదల చేయ‌బోతున్నారు. ఓ వైపు సినిమా ప్రమోషన్లు.. మరోవైపు సాంగ్స్ రిలీజ్ చేస్తూ సినిమా యూనిట్ మూవీపై ఆస‌క్తి పెంచుతుంది. అయితే ఈ సమ‌యంలోనే ఈ సినిమా టీమ్‌ను విమర్శిస్తూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టుపై రామజోగయ్య శాస్త్రి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నెటిజన్ పోస్టుకి ఆయన స్టైల్‌లో దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చారు.

సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా రీసెంట్‌గా మహేష్ బాబు, శ్రీలీల సాగే రొమాంటిక్ సాంగ్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్ . ఓ మై బేబీ అంటూ సాగే ఈ పాట జ‌నాలకి అంత ఎక్క‌లేదు. తమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ గత పాటలని పోలినట్లు అనిపించడం తో మహేష్ ఫ్యాన్స్ కి అంతగా ఎక్కలేదు. అంతేకాదు రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ కూడా బాగాలేవంటూ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. పాటలో ఇంగ్లీష్ ప‌దాలు ఎక్కువ‌గా ఉప‌యోగించార‌ని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆయ‌నపై ఆగకుండా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ సినిమా టీమ్‌ను విమర్శిస్తూ ఓ నెటిజన్ (@DPGAMERS9) ట్విట్టర్‌లో పోస్టు పెట్టాడు. ‘ ఇది నిదర్శనం అంటూ వరస్ట్ లిరిక్స్, వరస్ట్ మ్యూజిక్ అండ్ బీట్స్, ఓవర్ యాక్టింగ్ కేండిడేట్, అసలు ఎటువెళ్లిపోతుందో తెలియని గుంటూరు కారం.. అని రాస్తూ రామజోగయ్య శాస్త్రిని, మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌ని, నిర్మాత నాగవంశీని ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టాడు.

ఈ పోస్ట్‌పై స్పందించిన రామ‌జోగ‌య్య శాస్త్రి.. ‘సోషల్ మీడియాలో కొన్ని కుక్కలు తిరుగుతున్నాయి.. కొంతమందికి నిజంగా ఇక్కడ జరిగే ప్రక్రియ గురించి ఏమి తెలియ‌దు.. మనసులో దురుద్దేశం పెట్టుకుని తమ కామెంట్లతో ప్రతీది జడ్జ్ చేయ‌డం అల‌వాటుగా మారింది.. టెక్నీషియన్లను టార్గెట్ చేస్తారు.. ఇది అస్సలు మంచిది కాదు.. ఎవరో ఒకరు మాట్లాడాలి.. గీత దాటుతున్నారు వీళ్లు..’ అంటూ రామ‌జోగ‌య్య శాస్త్రి త‌న‌దైన శైలిలిలో వారికి కౌంట‌ర్ ఇచ్చారు. దీంతో అత‌ని ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

Exit mobile version