గ్లోబ‌ల్ స్థాయికి కుర్చీ మ‌డత పెట్టి సాంగ్..మోటార్ స్పోర్ట్ కంపెనీకి ఈ పాట వాడారేంటి?

  • Publish Date - April 10, 2024 / 06:59 AM IST

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, అందాల ముద్దుగుమ్మ శ్రీలీల ప్ర‌ధాన పాత్ర‌ల‌లో త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా అంత పెద్ద హిట్ కాలేదు కాని, ఇందులో కుర్చీ మ‌డ‌త పెట్టి సాంగ్‌కి మాత్రం హ్యూజ్ రెస్పాన్స్ వ‌స్తుంది. కుర్చీ తాత, ఆయన చెప్పిన డైలాగు సోషల్‌ మీడియాలో చాలా వైరల్‌గా మార‌డంతో చాలా మంది ఈ డైలాగుని వాడేసుకున్నారు. కొంద‌రు స్పూఫులు కూడా చేశారు. అయితే థ‌మ‌న్ అయితే ఏకంగా ఆ డైలాగ్‌తో మ‌హేష్ సినిమాలో పాట‌గా మలిచాడు. థమన్‌ కొట్టిన బీట్స్‌కు, ఆ పాట లిరిక్స్‌ అద్భుతంగా సెట్ కావ‌డంతో ఈ సాంగ్‌ జనాల్ని ఉర్రూతలూగిస్తుంది. ఇప్పుడు ఎక్క‌డ చూసిన ఇదే సాంగ్ హ‌వా న‌డుస్తుంది.

మ‌న తెలుగు రాష్ట్రాల‌లోనే కాకుండా ఇత‌ర రాష్ట్రాల‌లో కూడా కుర్చీ మ‌డ‌త పెట్టి సాంగ్‌ని తెగ వాడేస్తున్నారు. సినిమా రిలీజ్ నాలుగు నెలలు దాటిన‌ప్ప‌టికీ ఈ పాట‌కి ఉన్న క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఇప్ప‌టికీ ట్రెండింగ్‌లోనే ఉంది. రీజినల్ అండ్ నేషనల్ ల‌ని దాటి ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఈ పాట ట్రెండ్ అవుతూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది… నాటు నాటు తరువాత ఈ పాటకి ఇంటర్నేషనల్ ఆడియన్స్ చిందేయ‌డం విశేషంగా చెప్పుకోవాలి. జ‌ప‌నీస్‌, అమెరిక‌ర్స్ కుర్చీ మడతపెట్టి సాంగ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవ‌ల అమెరికా హూస్టన్ లో జరిగే నేషనల్ బాస్కెట్ బాల్ గేమ్స్‌లో.. కొంతమంది అమెరికన్స్ కుర్చీ మడతపెట్టి సాంగ్ కి అదిరిపోయే స్టెప్స్ వేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

ఇక తాజాగా ఇంటర్నేషనల్ మోటార్ స్పోర్ట్ కంపెనీ ‘నిస్సాన్ మోటార్ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్’ ( తమ కొత్త బ్రాండ్ కారుని ప్రమోట్ చేసుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్ లో ఓ రీల్ ని విడుద‌ల చేసింది. ఆ రీల్ బ్యాక్ గ్రౌండ్ లో కుర్చీ మడతపెట్టి తెలుగు సాంగ్ ప్లే అవుతుండ‌డం ప్ర‌తి ఒక్కరిని ఆశ్చ‌ర్యప‌రిచింది. మ‌న తెలుగు పాట క్రేజ్ ఇంటర్నేష‌న‌ల్ స్థాయికి చేరిందా అని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రీల్‌ని మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తూ ట్రెండింగ్‌లోకి వ‌చ్చేలా చేస్తున్నారు. మొత్తానికి ఆ రీల్‌కి కుర్చీ మ‌డ‌త పెట్టి సాంగ్ యాడ్ చేయ‌డంతో వారికి కూడా మంచి ప్ర‌మోష‌న్ ద‌క్కింద‌నే చెప్పాలి

Latest News