Chay Sreeleela: విరూపాక్ష డైరెక్ట‌ర్‌తో.. నాగ చైతన్య, శ్రీలీల‌

  • By: sr    news    Dec 16, 2024 10:50 AM IST
Chay Sreeleela: విరూపాక్ష డైరెక్ట‌ర్‌తో.. నాగ చైతన్య, శ్రీలీల‌

అక్కినేని నాగ చైతన్య తన పుట్టినరోజు సంద‌ర్భంగా ఓ ఆస‌క్తిక‌ర‌మైన అప్డేట్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టించిన తండేల్ సినిమా రిలీజ్‌కు ముస్తాబు అవుతుండ‌గా త‌ర్వాత న‌టించ‌బోయే కొత్త‌ సినిమాను ప్ర‌క‌టించి ప్రేక్ష‌కులకు మంచి స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు.

గ‌తేడాది సాయి ధ‌ర‌మ్‌తేజ్‌తో విరూపాక్ష వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాన్ని రూపొందించిన కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య న‌టించ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ఓ పోస్ట‌ర్‌ రిలీజ్ చేశారు.

‘NC24’ గా వ‌స్తున్న ఈ చిత్రం మైథ‌లాజిక‌ల్ నేపథ్యంలో తెరకెక్కనుండగా.. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్, ఎస్వీసీ క్రియోష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విరూపాక్ష, కాంతారా సినిమాలకు మ్యూజిక్ అందించిన అజినీష్ లోక్‌నాధ్‌ సంగీతం అందించబోతున్నారు.

ముందుగా మీనాక్షి చౌద‌రిని అనుకున్న‌ప్ప‌టికీ చివ‌ర‌కు శ్రీలీల‌ను క‌థానాయికగా ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌ నాగ చైతన్య ఏదో వెతుక్కుంటూ వెళ్తున్నట్టుగా ఉండి ఇంట్రెస్టింగ్‌గా ఉంది.