Sreeleela | శ్రీలీల అస‌లు ఆగ‌ట్లేదుగా.. ఊరుకులు పెడుతోంది

  • By: sr    news    Jan 08, 2025 5:29 PM IST
Sreeleela | శ్రీలీల అస‌లు ఆగ‌ట్లేదుగా.. ఊరుకులు పెడుతోంది

విధాత‌: ఇటీవ‌ల పుష్ప‌2 ది రూల్ సినిమాలో కిస్సిక్ పాట‌తో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల (Sreeleela)పేరు మ‌రోమారు దేశ‌వ్యాప్తంగా మారు మ్రోగుతోంది. ఇప్ప‌టికే తెలుగులో చేతిలో అర డ‌జ‌న్ సినిమాల‌తో దూసుకుపోతుండ‌డ‌మే కాక అటు త‌మిళ్‌, ఇటు బాలీవుడ్‌లోనూ వ‌రుస అవ‌కాశాల ద‌క్కించుకుంటూ పోటీ అనేది లేకుండా దూసుకుపోతుంది.

ప్ర‌స్తుతం తెలుగులో రాబిన్ హుడ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌, ర‌వితేజ మాస్ జాత‌ర‌, నాగ చైత‌న్య‌, అఖిల్, త‌మిళ్ శివ‌కార్తికేయ‌న్ సినిమాల్లో న‌టిస్తోంది.

తాజాగా బాలీవుడ్‌లోకి ఆరంగేట్రం చేస్తూ సైఫ్ అలీఖాన్ త‌న‌యుడు ఇబ్ర‌హీం అలీఖాన్ ఎంట్రీ ఇస్తున్న చిత్రంలో క‌థానాయుక‌గా సెల‌క్ట్ అయింది.

ఈక్ర‌మంలో శ్రీలీల (Sreeleela) రీసెంట్‌గా ముంబైలో సంబంధిత మూవీ టీంతో క‌లిసి సంద‌డి చేసింది. ఈ నేప‌థ్యంలో శ్రీలీల, ఇబ్ర‌హీం ఒక‌రికొక‌రు క‌లుసుకుని బెస్టాఫ్ ల‌క్ చెప్పుకున్నారు. ఇది కాకుండా మ‌రో మరో హిందీ సినిమాను కూడా ఈ కిస్సిక్ పాప సైన్ చేసిన‌ట్లు స‌మాచారం.

ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి. చూడాలి భ‌విష్య‌త్‌లో శ్రీదేవి, హేమా మాలినిలా శ్రీల‌ల కూడా బాలీవుడ్‌లో అగ్ర‌స్థానానికి చేరుకుంటుందేమో చూడాలి.

10