తహవూర్ రాణా NIA కస్టడీ పొడిగింపు
విధాత : ముంబై 26/11 ఉగ్రదాడుల సూత్రధారి తహవూర్ రాణా ఎన్‌ఐఏ కస్టడీని కోర్టు మరో 12 రోజులు పొడిగించారు. ఇప్పటికే అతడికి విధించిన 18 రోజుల ఎన్‌ఐఏ కస్టడీ ముగియడంతో ఎన్ ఐఏ అధికారులు సోమవారం ఉదయం కట్టుదిట్టమైన భద్రత మధ్య రాణాను ఎన్‌ఐఏ హెడ్ క్వార్టర్స్ నుంచి ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు తీసుకువచ్చి కోర్టులో హాజరుపర్చారు. మరింత విచారణ నిమిత్తం కస్టడి పొడిగించాలని కోర్టును కోరారు. సీనియర్ న్యాయవాది దయాన్ క్రిష్ణన్, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్‌లు ఎన్‌ఐఏ తరఫున వాదనలు వినిపించారు.
ఢిల్లీ లీగల్ సర్వీస్ అథారిటీ నియమించిన న్యాయవాది పీయూష్ సచ్‌దేవ నిందితుడు రాణా తరఫున వాదనలు వినిపించారు. వాదనలు అనంతరం జడ్జి చందర్ జిత్ సింగ్ రాణకు మరో 12రోజుల కస్టడీని కోర్టు పొడిగించింది. మరోవైపు రాణా తన కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram