2023కి గుడ్ బై చెప్పేసాం.. కొత్త సంవత్సరం నూతనోత్సాహంతో సరికొత్త స్కెచ్‌లు వేసుకొని కెరీర్‌లో ముందుకు సాగే ప్లాన్స్ వేసుకోవడం సహజం. ఇక సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే వచ్చే ఏడాది బడా సినిమాలు ప్రేక్షకులని పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో సంక్రాంతికి గుంటూరుకారం వస్తుంది. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అలానే హనుమాన్, నాగార్జున నా సామిరంగ వంటి , రవితేజ ఈగల్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇక పాన్ ఇండియా సినిమాల లిస్ట్ కూడా పెద్దదిగానే కనిపిస్తుంది.
అల్లు అర్జున్ పుష్ప2, ప్రభాస్ కల్కి, ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ గేమ్ చేంజర్ వంటి చిత్రాలు కొత్త ఏడాదిలో ప్రేక్షకులకి సరికొత్త థ్రిల్ అందించేందుకు సిద్ధమయ్యాయి. పుష్ప2 చిత్రం కోసం ప్రేక్షకులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. పుష్ప చిత్రం సంచలనాలు సృష్టించడంతో ఇప్పుడు పుష్ప2 మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. అలానే సలార్‌తో మంచి హిట్ కొట్టిన ప్రభాస్ త్వరలో కల్కి చిత్రంతో పలకరించనున్నాడు. భారీ తారాగణంతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇక ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర చిత్రం కూడా న్యూ ఇయర్‌లో సందడి చేయనుంది. రెండు పార్ట్‌లుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. తొలి పార్ట్ ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఇక రామ్ చరణ్ – శంకర్ కాంబోలో రూపొందిన గేమ్ చేంజర్ చిత్రం సమ్మర్ లో రానుందని, అలానే భారీతయుడు 2 చిత్రాన్ని కూడా వచ్చే ఏడాది వీలైనంత తొందరగా రిలీజ్ చేయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నాడట. ఇలా పలు పాన్ ఇండియా చిత్రాలు వచ్చే ఏడాది బాక్సాఫీస్‌పై దాడికి దిగుతుండగా, ఏ చిత్రం సంచలనాలు సృష్టిస్తుందా అని ఫ్యాన్స్ ఇప్పటి నుండే ఆలోచనలు చేస్తున్నారు.