టాలీవుడ్‌కి కన్నడ భామలు చాలా మందే వచ్చారు. వారిలో కొందరు తమ అదృష్టంతో, టాలెంట్‌తో బాలీవుడ్‌కి కూడా వెళ్లారు. అలాంటి వారిలో రష్మిక మందన్న ఒకరు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ భాషతో సంబంధం లేకుండా కెరీర్లో పుల్‌జోష్‌తో దూసుకుపోతుండడం మనం చూస్తూనే ఉన్నాం. నాగశౌర్య నటించిన ఛలో సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులో వరుసగా ఆఫర్లు అందుకుంది. గీతా గోవిందం, దేవదాస్, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరూ, భీష్మ వంటి చిత్రాలతో వరుస హిట్ల్ను ఖాతాలో వేసుకొని సత్తా చాటిన ఈ భామ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా కూడా మారింది.
ఇటీవల ఈ హీరోయిన్ ఫార్మ్ ని చూసిన ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్.. రష్మిక పై ఓ ప్రత్యేక ఆర్టికల్ కూడా ముద్రించిందంటే ఈ పాప క్రేజ్‌ని అర్ధం చేసుకోవచ్చు. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రష్మిక షాకింగ్ విషయం వెల్లడించింది. తన ఇన్‌స్టా స్టోరీలో శ్రద్ధా దాస్ తో దిగిన ఫోటో షేర్ చేస్తూ.. “మీ సమాచారం కోసం తెలియజేస్తున్నాము. ఈరోజు మేము చావు నుంచి ఇలా తప్పించుకున్నాము” అని చెబుతూ తమ కాళ్ల ఫొటోని ఇన్‌స్టా స్టోరీలో అప్‌లోడ్ చేసింది. ఇది చూసి అందరు అయోమయంలో ఉన్నారు. చావు నుండి తప్పించుకున్నాము అంటూ రష్మిక ఎందుకు పోస్ట్ పెట్టిందో అర్ధం కాక నెటిజన్స్ జుట్టు పీక్కుంటున్నారు.
పోస్ట్ చూస్తే మాత్రం వారిద్దరు కూడా జర్నీలో ఉండగా, తీసిన పిక్ అని ఆ సమయంలోనే ఏదో జరిగిందని అర్ధమవుతుంది. ఇక ఇదే పోస్టుని శ్రద్ధా దాస్ కూడా షేర్ చేయడం గమనర్హం. ఇక రష్మిక త్వరలోనే పుష్ప2 చిత్రంతో ప్రేక్షకులని పలకరించనున్న విషయం తెలిసిందే. పుష్ప చిత్రం మంచి విజయం సాధించడంతో పుష్ప2పై జనాలు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఆగస్ట్ 15న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మూడో పార్ట్ కూడా ఉండొచ్చు అంటూ ఇటీవల అల్లు అర్జున్ హింట్ ఇచ్చేసారు. పుష్ప ది రైజ్, ది రూల్, ది రోర్.. ట్యాగ్ లైన్స్ తో మూడు పార్టులుగా సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుండగా, మూడో పార్ట్‌లో కూడా రష్మిక నటిస్తుందా లేదా అనేది చూడాలి.