Site icon vidhaatha

Lion Left Him: నూకలున్నాయి.. అతడిని సింహం వదిలేసింది..!

Lion Left Him: : బ్రహ్మరాసిన నుదుటిరాతను ఎవరూ మార్చలేరు…శివుడి ఆజ్ఞా లేనిదే చీమ అయినా కుట్టదు..భూమి మీద నూకలుంటే ఎవడు ఏం చేయలేరన్న సూక్తులు..సామేతలు అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు చూస్తే నిజమనిపిస్తుండటం చూస్తుంటాం. ఇది కూడా అలాంటి ఘటనే మరి. వీధిలో నిద్రిస్తున్న ఒక వ్యక్తి సింహం చేతిలో చనిపోకుండా తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటన భారత దేశంలోనే చోటుచేసుకుంది. ఆహారం వెతుక్కుంటూ సమీప అడవి నుంచి రాత్రిపూట గ్రామంలో ప్రవేశించిన ఓ సింహం వీధుల్లో సంచరిస్తూ రోడ్డుపక్కన నిద్రిస్తున్న ఓ వ్యక్తి పక్కనుంచే వెళ్లింది. కొంత దూరం వెళ్లి తిరిగొచ్చిన సింహం మళ్లీ ఆ పడుకున్న ఆ వ్యక్తి వద్ధకు వెళ్లి అతన్ని వాసన చూసింది. అయితే ఎందుకోగాని అతడిని ఏమి అనకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది.

వీధిలో నిద్రిస్తున్న ఆ వ్యక్తి గాఢ నిద్రలో ఉండిపోవడంతో సింహం తన వద్ధకు వచ్చిన గమనించకోలేదు. అదే అతని ప్రాణాలు కాపాడింది. అతను ఏ మాత్రం కదిలినా..మేల్కొని సింహాన్ని చూసి గాభరా పడిన దానికి ఆహారంగా మారిపోయేవాడే. గాఢ నిద్ర సింహం నుంచి అతడి ప్రాణాలు కాపాడినట్లయ్యింది. ఇదంతా ఆ వీధిలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నుదుటి రాతను..బ్రహ్మ గీతను ఎవరు మార్చలేరని..భూమి మీద నూకలు ఉన్నందుకే..ఆయుషు మిగిలినందుకే సింహం నోట చిక్కలేదంటూ రకరకాల తాత్విక వ్యాఖ్యలు..సామేతలు పెడుతున్నారు.

 

Exit mobile version