Site icon vidhaatha

మ‌రోసారి ఊహించిన ఎలిమినేష‌న్.. హౌజ్‌లోకి మ‌రో భామ ఎంట్రీ…!

బిగ్ బాస్ సీజ‌న్ 7 కార్య‌క్ర‌మంలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో అర్ధం కాని ప‌రిస్థితి. అంతా ఉల్టా పుల్లా. ఎవ‌రిని ఎప్పుడు ఎలిమినేట్ చేస్తారు, హౌజ్‌లోకి ఎవ‌రిని ప్ర‌వేశింప‌జేస్తారు అంతా కూడా కొద్దిగా స‌స్పెన్స్‌గానే ఉంది. ఆదివారం ఎపిసోడ్ చాలా సంద‌డిగా సాగింది. హౌజ్‌లో ద‌స‌రా సంబ‌రాలు ఓ రేంజ్‌లో జ‌రిగాయి. సినీ తారల డ్యాన్స్ పెర్ఫామెన్స్ తో దుమ్ము రేపారు. ముఖ్యంగా బోల్డ్ భామ డింపుల్ హయతి తన స్పెషల్ డాన్స్ పెర్ఫామెన్స్ తో బిగ్ బాస్ వేదికని షేక్ చేసింది. క‌ళ్లు చెదిరే మూవ్‌మెంట్స్‌తో కేక పెట్టిస్తూ ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో అల‌రించింది.

ఇక ఒక‌వైపు సంద‌డిగా షో సాగుతున్న స‌మయంలో నాగార్జున ఒక్కొక్క‌రిని సేవ్ చేస్తూ వ‌చ్చారు. చివ‌రికి నామినేష‌న్‌లో పూజా మూర్తి, భోలే మిగిలి ఉండ‌గా, వారి ఇద్దరి ముందు రెండు బాక్స్ లో ఉంచారు. ఆ బాక్స్ లలో ఇద్దరూ చేతులు పెట్ట‌గా, వారు చేతులు బయటకి తీసినప్పుడు ఎవరి చేతికి రెడ్ కలర్ ఉంటుందో వారు ఎలిమినేట్. గ్రీన్ కలర్ వచ్చిన వాళ్ళు సేఫ్ అని నాగార్జున తెలియ‌జేశారు. నాగ్ కౌంట్ డౌన్ పూర్తి చేసిన వెంట‌నే ఇద్ద‌రు చేతులు బ‌య‌ట‌కు తీయ‌గా, పూజా మూర్తి చేతికి రెడ్ కలర్ అంటుకుంది. దీనితో పూజా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున తెలియ‌జేశారు.చివ‌రిదాకి ఉందామ‌ని వ‌చ్చిన ఆమెకు ఇంటి సభ్యులు సెండాఫ్ ఇచ్చారు. ఇక పూజా మూర్తి వేదికపై నాగార్జున వద్దకు వెళ్లి… ఒక్కొక్క ఇంటి సభ్యుల గురించి ఆమె తన అభిప్రాయాలు తెలియ‌జేసింది.

అనంత‌రం బిగ్ బాస్ షోలో మ‌రో స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇటీవ‌ల ఎలిమినేట్ అయిన ముగ్గురిలో ఒక‌రు బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లే ఛాన్స్ ఉంద‌ని నాగార్జున తెలియ‌జేసిన విష‌యం తెలిసిందే. హౌజ్‌మేట్స్ ఓటింగ్ ప్రకారం హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లే సెకండ్ ఛాన్స్ ర‌తిక‌కి ఛాన్స్ దక్కింది . దీంతో ఆమెకి నాగార్జున గ్రాండ్ వెల్‌క‌మ్ తెలిపారు. వచ్చిన ఈ సెకండ్ ఛాన్స్ ని ఉపయోగించుకుంటానని రతిక మాట ఇవ్వ‌గా, ఆమె ఎప్పుడు హౌజ్‌లోకి వ‌స్తుంద‌నేది బిగ్ బాస్ తెలియ‌జేస్తారు అని నాగ్ స్ప‌ష్టం చేశారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ చాలా సంద‌డిగా, ఆస‌క్తిగా సాగింది.

Exit mobile version