Site icon vidhaatha

Reactor Explodes| పటాన్‌చెరులో సిగాచీ కెమికల్స్ ఇండస్ట్రీలో పేలిన రియాక్టర్..8మంది మృతి

విధాత : పటాన్ చెరు పాశమైలారం పారిశ్రామిక వాడలో సిగాచీ కెమికల్స్ ఇండస్ట్రీలో రియాక్టర్ పేలిన ఘటనలో 8మంది కార్మికులు మృతి చెందారు. ఆరుగురు సంఘటన స్థలంలోనే చనిపోగా.. ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదంలో మరో 26మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ప్రమాద సమయంలో పరిశ్రమలో మొత్తం 150 కార్మికులు ఉండగా.. పేలుడు జరిగిన 90 మంది ఉన్నారని ఐజీ సత్యనారాయణ కథనం. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిప్రమాద నివారణ బృందాలు రెండు ఫైరింజన్లతోచ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మంటలు అదుపు చేసేందుకు శ్రమించాయి. పేలుడు ధాటికి కార్మికులు 100మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. కంపెనీ షెడ్డు కుప్పకూలింది. షెడ్డు కింద ఇంకా ఎవరైనా ఉన్నారా లేదో చూసేందుకు శిధిలాలలను తొలగించారు. క్షతగాత్రులను ఇస్నాపూర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అటు నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.. మంటలు ఎగిసిపడుతుండటంతో వాటిని అదుపు చేసేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. ఫ్యాక్టరీలోకి అప్పుడప్పుడే కార్మికులు విధుల్లోకి వస్తున్నందునా మరింత మంది కార్మికులకు ప్రమాదం తప్పినట్లయ్యింది. రియాల్టర్ పేలుడుతో ఎగిసిపడుతున్న కెమికల్ పొగల వాసనతో స్థానిక ప్రజలు ఇబ్బందిపడ్డారు.

Exit mobile version