Site icon vidhaatha

ఆద్య‌కి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పిన రేణూ దేశాయ్.. ఇక ప‌వ‌న్‌కి క‌ష్టాలు త‌ప్ప‌వా?

టాలీవుడ్ టాప్ హీరోగా, జ‌న‌సేన అధినేత‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎంత బిజీగా ఉంటున్నారో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఆయ‌న త‌న ఫ్యామిలీకి ఎక్కువ‌గా స‌మ‌యం కేటాయించ‌లేక‌పోతున్నారు. ప‌వ‌న్ గ‌తంలో రేణూ దేశాయ్‌ని వివాహం చేసుకోగా వారికి అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్ల‌లు జ‌న్మించారు. ఇక రేణూ దేశాయ్‌తో విడాకులు తీసుకున్న త‌ర్వాత అన్నాని పెళ్లి చేసుకోగా, ఆమెకి ఇద్దరు పిల్లలు జ‌న్మించారు. ప్ర‌స్తుతం అకీరా, ఆద్య త‌న త‌ల్లితో ఉంటుండగా, కొన్ని సంద‌ర్భాల‌లో మాత్రం తండ్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని క‌లుస్తుంటారు. వాటికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి.

తన పిల్లలను పవన్ కళ్యాణ్ పిల్లలు అంటే రేణు దేశాయ్ కొన్నిసార్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుంది.ప్ర‌స్తుతం అకీరా మ‌ల్టీ టాలెంటెడ్‌గా ఎదుగుతున్నాడు. అప్పుడ‌ప్పుడు అకీరా కి సంబంధించిన ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది రేణూ. త్వ‌ర‌లో అకీరా వెండితెర ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రుగుతున్నా కూడా దానిపై అయితే పూర్తి క్లారిటీ లేదు. ప్ర‌స్తుతం అకీరా మ్యూజిక్, ఫిల్మ్ మేకింగ్ మీద ఆసక్తి చూపుతున్నాడు. వీటిలో శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. ఆరున్నర అడుగుల అకీరా హీరో అయితే మాత్రం మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు అనేవి ఉండ‌వు.

ఇక ఆద్య విష‌యానికి వ‌స్తే ఈ చిన్నారి ప్ర‌స్తుతం స్ట‌డీస్ పైనే ఎక్కువ ఫోక‌స్ పెట్టింది. త‌ల్లితో క‌లిసి అడ‌పాద‌డ‌పా క‌నిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఆద్యకి సంబంధించిన ఓ గుడ్ న్యూస్ చెప్పింది రేణూ దేశాయ్. త‌న కూతురు ముక్కు కుట్టించుకుంద‌ని చెబుతూ, ఏడాదిగా ముక్క కుట్టించుకోవాల‌నుకున్నా వాయిదా వేస్తూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కి ఆద్య ముక్కు కుట్టించుకుంద‌ని చెబుతూ ఫొటో కూడా షేర్ చేసింది. ముక్కు పుడ‌క‌తో ఆద్య స‌రికొత్త లుక్‌లో కనిపిస్తుంద‌ని నెటిజ‌న్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి కొత్త తిప్పలు త‌ప్పేలా లేవు. ఆద్య‌కి న‌గ‌లు కొనిచ్చే విష‌యంలో మ‌రిన్ని బాధ్య‌త‌లు ప‌వ‌న్‌కి పెరిగే అవ‌కాశం ఉంద‌ని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Exit mobile version