Site icon vidhaatha

ఆర్ఎక్స్ 100 బ్యూటీకి కిడ్నీ స‌మ‌స్య‌నా.. షాకింగ్ విష‌యాలు చెప్పి అంద‌రి మైండ్ బ్లాక్ చేసిందిగా..!

ఆర్ఎక్స్ 100 చిత్రంలో నెగెటివ్ క్యారెక్ట‌ర్ పోషించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా దగ్గ‌రైన అందాల భామ పాయ‌ల్ రాజ్‌పుత్‌. ఈ సినిమాతో మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న పాయ‌ల్ ఆ త‌ర్వాత మాత్రం ఎందుకో స‌రైన స‌క్సెస్‌లు అంత‌గా అందుకోలేక‌పోయింది. అయిన‌ప్ప‌టికీ ఈ అమ్మ‌డు త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటూనే ఉంది. విభిన్న క‌థా చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఈ అమ్మ‌డు త‌న‌కి తొలి సినిమాతో మంచి హిట్ ఇచ్చిన అజ‌య్ భూప‌తితో క‌లిసి మంగ‌ళ‌వారం అనే సినిమా చేసింది. ఈ సినిమా పోస్ట‌ర్స్, ట్రైల‌ర్, టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా ఆక‌ట్టుకుంటున్నాయో ప్ర‌త్యకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమా మ‌రి కొద్ది రోజుల‌లో విడుద‌ల కానుండ‌గా, మూవీ ప్రమోషన్ కార్య‌క్ర‌మాలు జోరుగా సాగుతున్నాయి.

ఈ క్ర‌మంలో పాయ‌ల్ రాజ్‌పుత్ విశ్రాంతి లేకుండా ఇంట‌ర్వ్యూలు ఇస్తూ అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు షేర్ చేసుకుంటుంది. తాజాగా త‌న ఆరోగ్యం గురించి అలానే ల‌వ్ గురించి చెప్పి అంద‌రు షాక్ అయ్యేలా చేసింది. ముందుగా ఆరోగ్యం గురించి మాట్లాడిన పాయ‌ల్ త‌న‌కు నీళ్లు తాగే అల‌వాటు త‌క్కువ‌గా ఉంద‌ని చెప్పుకొచ్చింది. ఈ కార‌ణం వ‌ల్ల‌న కిడ్నీ స‌మ‌స్య‌లు వ‌చ్చి ఎన్నో ఇబ్బందులు ఎదుర‌య్యాయ‌ని పేర్కొంది. నాలా ఎవ‌రు ఇబ్బంది ప‌డ‌కుండా ఉండాలంటే మంచి నీళ్లు ఎక్కువ తాగుతూ శ‌రీరం డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవాల‌ని చెప్పుకొచ్చింది. పాయ‌ల్ రాజ్‌పుత్ ఎందుకు ఈ విష‌యం గురించి ఎప్పుడు ఓపెన్‌గా చెప్ప‌లేదు అని కొంద‌రు ముచ్చటించుకుంటున్నారు.

ఇక ఈ భామ త‌న ల‌వ్ గురించి కూడా ఓపెన్ అయింది. చదువుకునే రోజుల్లో ఒకరిని ప్రేమించిందట. అతన్ని చూస్తే చాలా సంతోషంగా అనిపించేదని, ఒక రోజు ధైర్యం చేసుకొని వెళ్లి ప్రపోజ్ చేస్తే నో చెప్పాడని పేర్కొంది. అత‌ని ధ్యాసలో ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల‌న చ‌దువుని కూడా నెగ్లెట్ చేసిందట. ఆ విష‌యం గుర్తొచ్చిన‌ప్పుడ‌ల్లా బాధ పడుతుంటాను అని పాయ‌ల్ రాజ్‌పుత్ చెప్పుకొచ్చింది. ఇక ఆర్ఎక్స్ 100 త‌ర్వాత తెలుగులో డిస్కో రాజా, అన‌గ‌న‌గా ఓ అతిథి, తీస్‌మార్‌ఖాన్, జిన్నాతో పాటు తెలుగులో ప‌లు సినిమాలు చేయ‌గా అవ‌న్నీ డిజాస్ట‌ర్స్‌గా మిగిలిపోయాయి. అయితే త‌న‌కి గైడెన్స్ ఇచ్చేవారు ఎవ‌రూ లేర‌ని, అందుకే క‌థ‌ల‌ ఎంపిక‌లో కొన్ని పొర‌పాట్లు జ‌రిగాయ‌ని వాటి వ‌ల్ల‌నే పెద్ద‌గా స‌క్సెస్‌లు రాలేద‌ని పాయ‌ల్‌ రాజ్‌పుత్ చెప్పింది. వెంకీ మామ‌లో త‌న వ‌య‌సుకు మించిన పాత్ర చేశాన‌ని, ఆ సినిమాలో త‌న లుక్ అస‌లు బాగోదంటూ పాయ‌ల్ తెలియ‌జేసింది. మ‌రి న‌వంబ‌ర్ 17న రానున్న మంగ‌ళ‌వారం అనే థ్రిల్ల‌ర్ చిత్రంతో అయిన పాయ‌ల్ మంచి విజ‌యం అందుకుంటుందా అనేది చూడాలి.

Exit mobile version