బిగ్ బాస్ సీజన్ 7లో ఈ వారం కెప్టెన్ అయ్యేందుకు హౌజ్‌మేట్స్ పలు టాస్క్‌లలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. హౌజ్‌మేట్స్‌ని గులాబీ పురం- జిలేబీ పురం అంటూ రెండు టీమ్‌లుగా విభజించిన బిగ్ బాస్ పలు టాస్క్‌లు ఇస్తూ వస్తున్నాడు. ముందు జిలేబి టీమ్ టీమ్ లీడ్‌లో ఉండగా, తాజా ఎపిసోడ్‌లో కూడా వారి హవానే నడిచింది. ‘అండర్ వాటర్ టాస్క్’ అంటూ టాస్ ఇవ్వగా, ఇందులో గులాబీ పురం నుంచి అమర్, తేజ పాల్గొనగా.. జిలేబీ పురం నుంచి ప్రియాంక, సందీప్ గేమ్ ఆడారు. ఈ టాస్క్‌లో భాగంగా ఒక సభ్యుడు తన పార్ట్నర్ కి సరైన కీ వెతికి పూల్ లో ఉన్న పార్ట్నర్ కి ఇస్తే వారు బాక్స్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎవరు ముందుగా బాక్స్ ఓపెన్ చేసి ఆ వస్తువు సాధిస్తే వారే విజేత అని బిగ్ బాస్ చెప్పారు.. ఈ టాస్క్ లో సందీప్, అమర్ మధ్య ఫైట్ ఆసక్తికరంగా జరగగా, సందీప్ విజేతగా నిలిచాడు.
అయితే ఓ సందర్భంలో ఇది కరెక్ట్ కాదంటూ అమర్ దీప్ బనియన్ పట్టుకొని వార్నింగ్ ఇచ్చాడు సందీప్. తాజాగ టాస్క్‌లో కూడా జిలేబీ పురమే గెలిచింది. అయితే తమ టీం గెలవలేకపోతుండడంతో గులాబీపురంపై శోభా శెట్టి రంకెలేసింది. ఆడటానికి వెళ్లిన అమరాన్ని కూడా ఓ ఉతుకు ఉతికేసింది. ఇక తర్వాత పెట్టిన స్పేస్ షిప్ ఛాలెంజ్‌లో గులాబీపురం నుంచి గౌతమ్.. జిలేబీపురం నుంచి రైతుబిడ్డ ప్రశాంత్ బరిలోకి దిగగా, ఇందులో గౌతమ్ టీం నెగ్గింది. అలా జరిగిన టాస్క్‌లలో గులాబిపురం ఎక్కువ గెలిచి లీడ్ సాధించింది.
అయితే ఈ టాస్కులో గౌతమ్ టీమ్ నెగ్గింది. దీంతో తొలి గేమ్ గెలిచారు గులాబీపురం టీమ్. కానీ నిన్నటి నుంచి జరిగిన మొత్తం టాస్కుల్లో గులాబీపురమే ఎక్కువ గెలిచి లీడ్‌లో ఉంది. అయితే ఈ టాస్కు అయిపోయిన తర్వాత అమరం-ప్రియాంక మధ్య చిన్న డిస్కషన్ జరిగింది. స్పేస్ షిప్ టాస్కులో తన టీమ్ ఓడిపోవడంతో ప్రియాంక కూర్చొని ఉండగా, అక్కడికి వచ్చిన అమర్ దీప్.. మాకు వచ్చింది ఒకటే.. సల్లబడు ఇక అని అన్నాడు. దీనికి ప్రియాంక రంకెలేసింది. అమర్ దీప్ మాటలకి ప్రియాంక అలిగి అక్కడి నుండి లేచి వెళ్లిపోయింది. అయితే ఆ తర్వాత అమర్ దీప్.. ప్రియాంక దగ్గరకు వెళ్లి సల్లబడు అనేది ఏమైనా బూతు పదమా.. నేను సరదాగా అన్నట్టు చెప్పుకొచ్చాడు. మొత్తానికి మొన్నటి వరకు శివాజీ, ప్రశాంత్‌లతో గొడవ పడిన అమర్ దీప్ ఇప్పుడు సీరియల్ బ్యాచ్ అయిన ప్రియాంక, శోభాలతో కూడా గొడవ పడాల్సి వస్తుంది. ఇక తాజా ఎపిసోడ్‌లో చిన్నపాటి కామెడీ కూడా జరిగింది. తమకి ఇచ్చిన క్యారెక్టర్స్ ప్రకారం తేజ, శోభా శెట్టి కపుల్ గా నటించారు. వీరిద్దరూ ఫన్నీగా ఫస్ట్ నైట్ సీన్ లో కూడా నటించి తెగ నవ్వించారు.