Karimnagar | ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరోసారి ఉగ్ర కలకలం.. ఇద్దరి అనుమానితులు అరెస్ట్

Karimnagar | రామగుండంలో ఉగ్రవాద అనుమానితులు ఇద్దరి అరెస్ట్ నిందితుల్లో ఒకరు సాఫ్ట్వేర్ ట్రైనర్ హైదరాబాద్ టోలిచౌక్ లో నివాసం ఉంటున్నట్టు గుర్తింపు బక్రీద్ పండుగ కోసం బంధువుల ఇంటికి రామగుండంకు ఫోన్ సిగ్నల్స్ ద్వారా గుర్తించిన ఏటిఎస్ గతంలో ఇక్కడే తీవ్రవాది అజాంఘోరీ ఎన్ కౌంటర్ విధాత బ్యూరో, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరోసారి ఉగ్రవాదుల సంచారం కలకలం రేపింది. గతంలో ఉగ్రవాది అజాంఘోరిని పోలీసులు ఇదే జిల్లాలో హతమార్చారు.తాజాగా పెద్దపల్లి జిల్లా […]

  • Publish Date - June 27, 2023 / 06:00 PM IST

Karimnagar |

  • రామగుండంలో ఉగ్రవాద అనుమానితులు ఇద్దరి అరెస్ట్
  • నిందితుల్లో ఒకరు సాఫ్ట్వేర్ ట్రైనర్
  • హైదరాబాద్ టోలిచౌక్ లో నివాసం ఉంటున్నట్టు గుర్తింపు
  • బక్రీద్ పండుగ కోసం బంధువుల ఇంటికి రామగుండంకు
  • ఫోన్ సిగ్నల్స్ ద్వారా గుర్తించిన ఏటిఎస్
  • గతంలో ఇక్కడే తీవ్రవాది అజాంఘోరీ ఎన్ కౌంటర్

విధాత బ్యూరో, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరోసారి ఉగ్రవాదుల సంచారం కలకలం రేపింది. గతంలో ఉగ్రవాది అజాంఘోరిని పోలీసులు ఇదే జిల్లాలో హతమార్చారు.తాజాగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉగ్రవాదులతో సంబంధం ఉందన్న అనుమానంతో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మంగళవారం సాయంత్రం నుండి రామగుండంలో తనిఖీలు నిర్వహించిన గుజరాత్ ఏటిఎస్ పోలీసు బృందం టెర్రరిస్టులతో సంబంధం ఉన్నట్టు అనుమానాలతో మహ్మద్ జావీద్ అనే వ్యక్తితో పాటు.. ఆయన కూతుర్ని అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ టోలిచౌక్ కు చెందినట్టు భావిస్తున్న జావీద్ కు టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని నిర్ధారణకు వచ్చిన గుజరాత్ ఏ టి ఎస్ బృందం స్థానిక పోలీసుల సహకారంతో వీరు నివాసం ఉండే ప్రాంతాన్ని గుర్తించింది. బక్రీద్ పండుగ సందర్భంగా జావిద్ రామగుండంలోని తమ బంధువుల ఇంటికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆయన ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేసిన పోలీసులు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుండి తనిఖీలు మొదలు పెట్టారు.

సాఫ్ట్ వేర్ ట్రైనర్ గా పని చేస్తున్న జావీద్ శ్రీనగర్ కాలనీలో నాలుగు రోజులుగా షెల్టర్ తీసుకుని ఉంటున్నారన్న పక్కా సమాచారంతో గుజరాత్ ఏటీఎస్ తనిఖీలు చేపట్టారు. గత నాలుగేళ్లుగా హైదరాబాద్ లో ఉన్న జావీద్ కు టెర్రరిస్ట్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న సమాచారం మేరకు ఏటీఎస్ బృందాలు రంగంలోకి దిగాయి.

రామగుండంలో వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ లోని ఏటీఎస్ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అదుపులో తీసుకున్న వ్యక్తుల తరలింపు కోసం ఏటిఎస్ పోలీసులకు తోడుగా సీఐ స్థాయి అధికారిని రామగుండం పోలీసులు పంపించారు.

Latest News