Site icon vidhaatha

విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక మ‌ధ్య రిలేష‌న్ ఏంటి.. ర‌ష్మిక‌ని ఆనంద్ అలా పిలుస్తాడా..!

ఇటీవలి కాలంలో చాలా మంది హీరో హీరోయిన్స్ ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. వ‌రుణ్ తేజ్ లావ‌ణ్య త్రిపాఠి చాలా ఏళ్ల పాటు ప్రేమించుకున్న కూడా ఆ విష‌య ఎవ‌రికి తెలియ‌దు. సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకునే స‌రికి అంద‌రు షాక్ అయ్యారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌లో ర‌ష్మిక విజ‌య్ దేవ‌ర‌కొడ రిలేష‌న్ గురించి నెట్టింట అనేక ప్ర‌చారాలు జ‌రుగుతున్నా కూడా వాటికి సంబంధించి ఎలాంటి క్లారిటీ రావ‌డం లేదు. విజ‌య్, ర‌ష్మిక క‌లిసి ప‌లు సినిమాల‌లో క‌లిసి న‌టించ‌డం వ‌ల‌న వార‌ద్ద‌రి మ‌ధ్య ప్రేమ ఏర్ప‌డింద‌ని ప‌లువురు చెబుతున్న మాట‌. ఇంకా వారు అప్పుడ‌ప్పుడు డిన్నర్ డేట్ లకు వెళ్ళడం.. ఫారెన్ ట్రిప్పులు వేస్తూ వారి బంధం గురించి ఇన్‌డైరెక్ట్ హింట్ ఇచ్చేవారు.

అయితే ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంది అని ఫిక్స్ అవుతున్నారు కాని క్లారిటీ రావ‌డం లేదు. ఫారెన్ ట్పిప్పుకు ఇద్దరూ కలిసి వెళ్లకపోయినా.. ఒకే లొకేషన్ కు వెళ్ళడం.. డ్రస్ కోడ్ మెయింటేన్ చేయడం.. ఇవన్నీ ఫ్యాన్స్ లో లేని పోని అనుమానాలు తెప్పిస్తున్నాయి. ఇటీవ‌ల విజ‌య్ దేవ‌ర‌కొండ ధరించిన క్యాప్‌ని ర‌ష్మిక ధరించ‌డం కూడా అంద‌రిలో అనేక అనుమానాలు క‌లిగించింది. అయితే విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా రష్మికతో క్లోజ్ గా ఉంటుంటాడు. ఆమెతో ఎన్నోసార్లు ఆమెతో స్టేజ్ పంచుకున్న ఆనంద్ దేవ‌ర‌కొండ ర‌ష్మిక‌తో చాలా స‌న్నిహితంగా మెల‌గ‌డం మ‌నం చూశాం. ఆ స‌మ‌యంలో ఫ్యాన్స్.. వదినా వదినా అని పిలవాలంటూ.. కామెంట్లు చేయడం లాంటివి బాగా వైరల్ అయ్యాయి

రష్మిక – విజయ్ మధ్య ఏదో ఉందని తాజాగా నెటిజ‌న్స్ కామెంట్ చేస్తున్నారు. ఆనంద్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు సంద‌ర్భంగా ర‌ష్మిక త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆనంద్ దేవరకొండ ఫోటో షేర్ చేసి హ్యాపీ బర్త్ డే ఆనందా.. అని పోస్ట్ చేసింది. దీనికి థ్యాంక్యూ రషీ.. కానీ ఈ వరస్ట్ ఫోటో ఎందుకు పెట్టావు అని సరదాగా అన్నాడు ఆనంద్ దేవ‌ర‌కొండ . దీనికి రష్మిక మళ్ళీ తన స్టోరీలో రిప్లై ఇస్తూ అందుకే నేను అడిగినప్పుడు మంచిగా పోజ్ ఇమ్మనేది అని సరదాగా ఇంకో స‌మాధానం ఇచ్చింది. ఇదంతా చూసి విజ‌య్ దేవ‌ర‌కొండ‌-ర‌ష్మిక మ‌ధ్య ఏదో రిలేష‌న్ ఉంద‌ని అందుకే విజ‌య్ త‌మ్ముడు కూడా అంత క్లోజ్‌గా మాట్లాడుతున్నాడ‌ని అంటున్నారు. మ‌రి దీనిపై ఎప్పుడు క్లారిటీ వ‌స్తుందా అనేది చూడాలి.

Exit mobile version