Site icon vidhaatha

kohli to be captain for rcb

ర‌న్‌మెషీన్ విరాట్ కోహ్లీ ప్ర‌స్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఆయ‌న 2023లో అద్భుత‌మైన ఆట‌తీరు క‌న‌బ‌రిచాడు. ముఖ్యంగా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌2023లో 765 ప‌రుగులు చేశాడు. దీంతో ఓ ఎడిష‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును కూడా బ‌ద్దులు కొట్టి చ‌రిత్రం సృష్టించాడు. అంతేకాక వ‌న్డేల‌లో అత్యధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాడిగా కూడా కోహ్లీ టాప్‌లో ఉన్నాడు. ఇక కోహ్లీ ప్ర‌స్తుతం సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడుతుండ‌గా, మ‌రి కొద్ది రోజుల‌లో జ‌ర‌గ‌నున్న‌ ధనాధ‌న్ ఐపీఎల్ టోర్నీలోను దుమ్ము రేపేందుకు కూడా సిద్ధంగా ఉన్నాడు. కొన్నాళ్లుగా రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు త‌ర‌పున ఆడుతున్న కోహ్లీ త‌న టీంకి ఒక్క‌సారి కూడా ట్రోఫీ అందించ‌లేక‌పోయాడు. భారీ అంచ‌నాల‌తో బ‌రిలోకి దిగిన ఎందుకు చివ‌రిలో చ‌తికిల‌ప‌డుతూ ఉంటుంది.

అయితే ఆర్సీబీకి కొన్నాళ్లు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌గా, ఆ త‌ర్వాత డుప్లెసిస్ కెప్టెన్సీ ప‌గ్గాలు చేప‌ట్టారు. అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం మార‌లేదు. ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలో మొత్తం 27 మ్యాచ్‌లు ఆడగా, 14 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించి, 13 మ్యాచుల్లో ఓడిపోయింది. డుప్లెసిస్ గైర్హాజరీలో విరాట్ కోహ్లి గత సీజన్‌లో మూడు మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ జట్టుకు నాయకత్వం వహించాడు. అతను తన దూకుడైన కెప్టెన్సీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఇప్పుడు ఆర్సీబీ ఫ్రాంచైజీ మళ్లీ కోహ్లీకి కెప్టెన్సీ ఇస్తుందా అనే డిస్క‌ష‌న్ మొద‌లైంది. కెప్టెన్సీ భారం వ‌ల‌న ఆయ‌న అంత‌ట ఆయ‌న‌నే సార‌థ్యం నుడి త‌ప్పుకున్నాడు.

టీమిండియా జ‌ట్టుకి అప్ప‌ట్లో కెప్టెన్‌గా ఉన్నందున ఎక్కువ భారం అనిపించి కోహ్లీ త‌ప్పుకోగా, ఇప్పుడు ఆయ‌న కేవ‌లం ఆట‌గాడిగా మాత్ర‌మే ఉన్నారు. మ‌రోవైపు డుప్లెసిస్ వరుసగా రెండు సీజన్లలో జట్టును నడిపించినా.. ఆశించిన ప్రదర్శన మాత్రం రావ‌డం లేదు. క‌నీసం విరాట్ కోహ్లి నాయకత్వంలో ఆర్సీబీ 3 సార్లు ప్లే ఆఫ్స్‌లోకి ప్రవేశించగా, ఒకసారి ఫైనల్ ఆడింది. కాని డుప్లెసిస్ కెప్టెన్సీలో అయితే లీగ్‌లోనే ఇంటిబాట ప‌ట్టింది. ఇవన్నీ గ‌మ‌నించిన ఆర్సీబీ ఫ్రాంచైజీ తిరిగి కోహ్లీకి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుంద‌ని ఆలోచిస్తున్నార‌ట‌.ఇక ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ పలు రికార్డులకు చేరువలో ఉన్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా అవతరించడానికి కోహ్లీ కేవలం 152 పరుగుల దూరంలో ఉన్నాడు. టీ20ల్లో 35 పరుగులు చేస్తే.. 12 వేల పరుగులు పూర్తి చేసిన టీమ్ ఇండియా మొదటి ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.

Exit mobile version