Site icon vidhaatha

మ‌రోసారి అశ్వినిని టార్గెట్ చేసిన శోభ‌.. ప్రియాంక‌కి దిమ్మ తిరిగే షాకిచ్చిన యావ‌ర్

బిగ్ బాస్ సీజ‌న్ 7లో గ‌త రెండు రోజులుగా విచిత్ర‌మైన టాస్క్‌లు ఆడుతూ ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు కంటెస్టెంట్స్. జిలేబి పురం అండ్ గులాబీపురం అంటూ రెండు గ్రూపులుగా విడిపోయి కంటెస్టెంట్స్ గేమ్ ఆడారు. అయితే జిలేబి పురం వాళ్లు ఎక్కువ టాస్క్‌ల‌లో గెల‌వ‌గా, వారిలో కెప్టెన్సీ కంటెండర్స్ గా ఉన్న వారిలో నచ్చని వారిని తొలగించే ఛాన్స్ గులాబీపురం వాళ్లకు ఉంటుందని బిగ్ బాస్ తెలియ‌జేశారు. బజర్ మోగినప్పుడు గులాబీ పురం సభ్యులలో ఎవరో ఒకరు చైన్ దక్కించుకొని, . తమకు నచ్చని కంటెండర్స్ ఫోటోని పూల్ ముంచి పోటీ నుంచి వారిని త‌ప్పించాల్సి ఉంటుంది. అందుకు త‌గిన కార‌ణం కూడా చెప్పాల‌ని బిగ్ బాస్ ఆదేశించారు.

ముందుగా శోభా శెట్టి గొలుసు దక్కించుకుంది. తాను అశ్విని ఫోటో నీళ్లలో ముంచి ఆమెని కెప్టెన్సీ పోటీ నుంచి తప్పిస్తున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో శోభా, అశ్విని మధ్య కొంత డిస్క‌ష‌న్ న‌డించింది. నువ్వు ఎప్పుడు నాకు నెగెటివ్‌గానే ఉంటావ‌ని అశ్విని పేర్కొంది. ఆ స‌మ‌యంలో శోభా క‌సితో అశ్విని ఫొటోని పూల్‌లో వేసింది. అనంత‌రం అమర్.. శివాజీ ఫోటోని నీళ్లల్లో ముంచేశారు. శివాజీ అమర్ నిర్ణయంతో కొంత ఆవేదన చెందారు. త‌న‌ని అన‌వ‌స‌రంగా త‌ప్పించాడంటూ కొంత ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ బిగ్ బాస్ హౌజ్‌లో నేను ఉండ‌లేను, కాని త‌లుపులు తీసేస్తే వెళ్లిపోతానంటూ కొంత ఆగ్ర‌హంతో మాట్లాడాడు శివాజి.

మ‌రోసారి అశ్వినిని టార్గెట్ చేసిన శోభ‌.. ప్రియాంక‌కి దిమ్మ తిరిగే షాకిచ్చిన యావ‌ర్ఇక పూజా.. ప్రశాంత్ ని కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి తప్పించింది. యావర్.. ప్రియాంక ని తప్పించడంతో ఆయ‌న‌పై విరుచుకుప‌డింది.. ఎదుటివాళ్ళు ఏమి చెబుతున్నారో వినకుండా ప్రియాంక గొడవకు దిగుతుంది అని.. అలాంటి వ్యక్తికి కెప్టెన్ అయ్యే అర్హత లేదంటూ య‌వ‌ర్ త‌న అభిప్రాయం తెలియ‌జేశాడు. ఈ క్రమంలో యావర్, ప్రియాంక మధ్య కొంత డిస్క‌ష‌న్ జ‌రిగింది. నేను అంద‌రిని భ‌య‌పెడుతున్న‌ట్టు నీకు అనిపించిందా.. రోజు రాత్రి తెల్ల చీరకట్టుకుని కలలోకి వస్తున్నాను కదా అంటూ ప్రియాంక కాస్త సెటైరిక‌ల్‌గా మాట్లాడింది. ఇక ఇలా కొంద‌రు తొల‌గింప‌బ‌డిన త‌ర్వాత కంటెండర్స్ గా మిగిలింది సందీప్, అర్హున్. వీళ్ళిద్దరూ కెప్టెన్సీ పోటీకి అర్హత సాధించినట్లు బిగ్ బాస్ తెలియ‌జేశారు. ఇక ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ మాన్షన్ 24 డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుండ‌గా, దీని ప్ర‌మోష‌న్ లో భాగంగా ఓంకార్, అవికా గోర్, వరలక్ష్మి శరత్ కుమార్, నందు సంద‌డి చేశారు.

Exit mobile version