బిగ్ బాస్ సీజన్7 పదో వారానికి చేరుకుంది. ప్రతి సీజన్‌లో కూడా పదో వారం ఫ్యామిలీస్‌ని హౌజ్‌లోకి ప్రవేశపెడతారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో హౌజ్‌మేట్స్ తెగ ఎమోషనల్ అవుతూ ప్రేక్షకులని కూడా ఎమోషనల్ చేస్తారు. అయితే ముందుగా శివాజి తనయుడు డాక్టర్‌లా హౌజ్‌లోకి వచ్చి సందడి చేశాడు. కొడుకుని చూసి తెగ ఏడ్చేశాడు. ఇక ఆయన తన కొడుకుని అందరికి పరిచయం చేశాడు. కొడుకు దగ్గర నుండి పలు సలహాలు తీసుకున్నాడు. ఆటలో నిన్నురెచ్చగొడుతున్నారని, కానీ రెచ్చిపోవద్దని, కూల్‌గా ఉండమని తండ్రికి సలహా ఇచ్చాడు శివాజీ తనయడు. ఇక చివరలో శివాజీని ఆయన తనయుడు వేలితో గోకి ఏదో సైగ చేశాడు. ఇది బిగ్ బాస్ పర్టిక్యులర్‌గా చూపించాడు.
ఇక అర్జున్ వైఫ్ సురేఖ బిగ్ బాస్ హౌజ్‌లోకి రాగా, ఆమె తన భర్తని ముద్దులతో ముంచెత్తింది. నువ్వు గట్టిగా మాట్లాడట్లేదని, సైలెంట్‌గా ఉంటున్నావని చెబుతూ పలు సలహాలు ఇచ్చింది.గోరు ముద్దలు కూడా తినిపించింది. లోపల బేబి రాత్రిళ్లు నిద్ర లేకుండా చేస్తుందని అర్జున్ భార్య చెప్పడంతో ఆయన ఉబ్బితబ్బిబయ్యారు. ఇక బిగ్ బాస్ సమక్షంలో అర్జున్ వైఫ్‌కి సీమంతం వేడుక జరిగింది. ఇది అర్జున్, ఆయన భార్య చాలా ఎమోషనల్ అయ్యేలా చేసింది. ఇక అర్జున్ భార్య వెళ్లిపోయాక అశ్విని తల్లి హౌజ్‌లోకి అడుగుపెట్టింది.అమ్మ రాగానే అశ్విని కన్నీళ్లు పెట్టుకుంది.తన బాధలని అమ్మతో చెప్పుకొని తెగ ఏడ్చేసింది.అప్పుడు అశ్విని తల్లి కూతురిని ఓదార్చి.. నువ్వు ఊరికే ఏడవొద్దు. నిన్ను చిన్న చూపు చూసిన వారికి నువ్వేంటో చూపించాలి. స్ట్రాంగ్‌గా ఎదిగి చూపించాలని ధైర్యం ఇచ్చింది.
అశ్విని తన తల్లిని చూశాక కొంత ధైర్యం తెచ్చుకున్నట్టు తెలుస్తుంది. అశ్విని తల్లి కూతురికి స్ట్రాంగ్‌గా ఉండమని చెప్పడంతో పాటు గట్టిగా వాదించమని కోరింది. లిమిట్స్ దాటితే ఊరుకునేది లేదని కూడా తెలియజేసింది. ఇక అశ్విని తల్లి వెళ్లిపోతున్న సమయంలో ఈ రోజుకి అమ్మని హౌజ్‌లో ఉంచమని బిగ్ బాస్‌ని వేడుకుంది. అమ్మా ఇక్కడే ఉండిపోవా అంటూ వేడుకుంది. కన్నీళ్లు పెట్టుకుంది. అశ్విని బాధని చూసి ప్రేక్షకులు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. మొత్తానికి ఫ్యామిలీ ఎపిసోడ్ ఆద్యంతం ఎమోషనల్‌గా సాగింది.ఇక నేడు గౌతమ్ అమ్మతో పాటు ఇతర హౌజ్‌మేట్స్ కుటుంబ సభ్యులు హౌజ్‌లోకి అడుగుపెట్టి సందడి చేయనున్నారు.