బిగ్ బాస్ సీజన్ 7లో కెప్టెన్సీ టాస్క్ చాలా రంజుగా సాగుతుంది. విచిత్రమైన టాస్క్‌లు ఇస్తూ కంటెస్టెంట్స్‌ని నానా తిప్పలు పెడుతున్నాడు బిగ్ బాస్. ఇక టాస్క్‌ల సమయంలో ఒకరిపై ఒకరు నోరు పారేసుకోవడం కూడా జరుగుతుంది.అయితే కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఇచ్చిన టాస్క్‌లలో వీరసింహాలు గెలుపొందడంతో వారికి గోనె సంచుల టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో భాగంగా పోటీలో ఉన్న కంటెస్టెంట్స్ తమ బస్తాలను ఫ్రీగా ఉన్న ఇతర కంటెస్టెంట్లకి ఇచ్చి, వారి చేత గేమ్ ఆడించాల్సి ఉంటుంది. ఇక ఈ టాస్క్‌లో సంచులని ఇతరులు ఖాళీ చేయాల్సి ఉంటుంది.
ప్రతి రౌండ్‌లో ఎవరి బస్తా తక్కువ అవుతుందో వారు ఎలిమినేట్ అవుతారని బిగ్ బాస్ తెలిపాడు. అయితే టాస్క్‌లో భాగంగా అమర్ దీప్ వీరవిహారం చేసాడు.గట్టిగట్టిగా అరుస్తూ నానా రచ్చ చేశాడు. తనపై నలుగురు అటాక్ చేశారని అశ్విని చెప్పగా, నన్ను కూడా కొట్టారని అమర్ చెప్పాడు. ఇక భోలే కూడా తనని ఎవరో కొట్టారంటూ చెప్పుకొచ్చాడు. మరోవైపు రతిక మధ్యలో రాగా, ఆమెపై ఫుల్ ఫైర్ అయ్యాడు అమర్‌దీప్.ఇక టాస్క్‌లో తేజ తరపున ఆడిన ప్రియాంక బ్యాగ్ ఖాళీ కాగా, అమర్ దీప్ వద్ద ఉన్న సంచి నిండుగా ఉంది. శోభా బస్తాతో అమర్‌దీప్ ఆట ఆడిన నేపథ్యంలో శోభా శెట్టి విన్నర్‌గా నిలిచారు. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 7లో తొలిసారి లేడి కెప్టెన్‌గా శోభ అయింది.
ఇక అశ్వినికి సంబంధించి గౌతమ్ చేసిన కామెంట్లు రచ్చగా మారాయి. ఇక శివాజీ తనని దూరం పెడుతున్నారని,కొందరిని మాత్రమే ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడని అశ్విని చెప్పుకొచ్చింది. కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ఇక గౌతమ్ మాట్లాడుతూ తనని కెప్టెన్ కాకుండా మ్యాచ్ ఫిక్స్ చేశారని ఆరోపించాడు. బిగ్ బాస్ సరైన దారిలో వెళ్లడం లేదని , తప్పులు చేసి కవర్ చేసుకుంటున్నారని అన్నాడు. తనకు వ్యతిరేఖంగా శివాజి గేమ్ ప్లాన్ చేస్తున్నాడని, తాను చూడలేకపోతున్నానని, అన్యాయం జరుగుతుందని, తనని డైరెక్ట్ ఎలిమినేట్ చేసి ఇంటికి పంపించండి అని గౌతమ్ చేసిన కామెంట్స్ రచ్చ లేపాయి.