First Corona Case In Telangana:: తెలంగాణలో మరోసారి కరోనా కలకలం రేపింది. ఈ సీజన్ లో తొలి కరోనా కేసుగా హైదరాబాద్- కూకట్‌పల్లిలో ఓ వైద్యుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం. ఇప్పటికే పొరుగున ఉన్న ఏపీలో కరోనా కేసులు వెలుగు చూశాయి. ఏపీ విశాఖలో కొవిడ్ కేసు నమోదైంది. పిఠాపురం కాలనీకి చెందిన మహిళకు కొవిడ్ నిర్ధారణ అయ్యింది. కడపలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. తీవ్ర జ్వరంతో కడప రిమ్స్ లో చేరిన నంద్యాల జిల్లా వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
భారత్ లో ఇప్పటికే 257కేసులు నమోదయ్యాయి. కేరళాలో 200కుపైగా కేసులు నమోదయ్యాయి. సింగపూర్, థాయిలాండ్, చైనాలో విస్తరిస్తున్న కరోనా వైరస్ క్రమంగా భారత్ లోనే విస్తరిస్తుంది. ఆదిలోనే కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రకటించాయి. ప్రజలు మాస్కులు ధరించాలని..కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది. ఐసోలేషన్ కేంద్రాలు, ఆసుపత్రులను సిద్దం చేయాలని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.