Emmanuel | బిగ్‌ బాస్‌లో లీకైన ఇమ్మాన్యుయేల్ ల‌వ్ స్టోరీ.. ఏంటి ఆయ‌న ల‌వర్ డాక్ట‌రా..!

Emmanuel | జబర్దస్త్ షోతో పాపులర్ అయిన కమెడియన్‌ ఇమ్మాన్యుయెల్‌, బిగ్ బాస్ తెలుగు 9లో టాప్ కంటెస్టెంట్‌గా దూసుకుపోతున్నాడు. తన కామెడీ టాలెంట్‌తో, టాస్కుల్లో చూపిస్తున్న పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న ఇమ్మాన్యుయెల్‌ ఇప్పటికే రెండు సార్లు కెప్టెన్‌గా ఎంపికై, ఫైనల్ రేసులో బలమైన పోటీదారుడిగా నిలుస్తున్నాడు.

Emmanuel | జబర్దస్త్ షోతో పాపులర్ అయిన కమెడియన్‌ ఇమ్మాన్యుయెల్‌, బిగ్ బాస్ తెలుగు 9లో టాప్ కంటెస్టెంట్‌గా దూసుకుపోతున్నాడు. తన కామెడీ టాలెంట్‌తో, టాస్కుల్లో చూపిస్తున్న పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న ఇమ్మాన్యుయెల్‌ ఇప్పటికే రెండు సార్లు కెప్టెన్‌గా ఎంపికై, ఫైనల్ రేసులో బలమైన పోటీదారుడిగా నిలుస్తున్నాడు.

ఫ్యామిలీ వీక్‌లో ఎంట్రీ ఇచ్చిన ఇమ్మాన్యుయెల్‌ అమ్మ

ఫ్యామిలీ వారం సందర్బంగా చివరగా ఇమ్మాన్యుయెల్‌ అమ్మ హౌజ్‌లోకి వచ్చింది. అమ్మను చూసి ఇమ్మాన్యుయెల్‌ భావోద్వేగానికి గురయ్యాడు. కుమారుడిని ఓదార్చిన ఆమె, “బాగా నవ్విస్తున్నావ్‌, బాగా ఆడుతున్నావ్‌. అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. 35 ఏళ్ల కోరికని తీర్చావ్‌. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు హీరో అయ్యావ్ అంటూ గర్వంగా చెప్పింది. అంతేకాదు, కమెడియన్‌గా వచ్చావ్‌, హీరోగా బయటకు రావాలి అంటూ ప్రోత్సహించింది. బిగ్ బాస్‌ నుంచి బయటకు వచ్చిన వెంటనే అతనికి పెళ్లి చేస్తానని మాట ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేసింది.

ఇమ్మాన్యుయెల్‌ లవర్ నుండి వచ్చిన లవ్ నోట్

ఇదిలా ఉంటే, ఇమ్మాన్యుయెల్‌ లవర్ కూడా ఆయనకు ఒక ఎమోషనల్ లేఖ రాసింది. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో వెనుక రాసిన ఆ నోట్‌లో, ఇంట్లో అందరినీ ఒప్పించానని, వారి ప్రేమకు కుటుంబం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పేర్కొంది. మన ప్రేమకి ఫైనల్‌గా సొల్యూషన్ దొరికింది. ఇంట్లో అందరు నిన్ను అంగీకరించారు. నీ గేమ్‌, నీ ఫన్‌ వారికి బాగా నచ్చాయి. నువ్వు గెలిచివస్తే ఇద్దరం కలిసి అందరి ఆశీర్వాదాలు తీసుకుందాం. ఐ లవ్ యూ ఫెలో అని రాయ‌గా, ఈ సందేశం చూసిన ఇమ్మాన్యుయెల్‌ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

ఇన్‌స్టాగ్రామ్‌ లో మొదలైన ప్రేమ

ఇమ్మాన్యుయెల్‌ లవర్‌ ఒక డాక్టర్‌. ఇద్దరి పరిచయం ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలై, ఆ త‌ర్వాత నెంబ‌ర్స్ మార్చుకున్నారు. ఇక నిత్యం మాట్లాడుకుంటున్న క్ర‌మంలో అది ప్రేమగా మారింది. అయితే త‌న‌తో మాట్లాడే స‌మ‌యంలో ఆమెని పెళ్లి చేసుకోవాల‌నే ఫీలింగ్ ఇమ్మూకి క‌లిగింద‌ట‌.ఆ విష‌యాన్ని ఆమెతో చెప్ప‌గా, డాక్ట‌ర్ కోర్స్ కంప్లీట్ అయ్యాక చేసుకుందామ‌ని చెప్పింద‌ట‌. ఈ విష‌యాన్ని కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్‌లోనే చెప్పాడు. ఇక ఇప్పుడు అమ్మ, లవర్ ఇద్దరి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇమ్మాన్యుయెల్‌ మ్యారేజ్ త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌బోతుంది. బిగ్ బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చాక, ఇమ్మాన్యుయేల్ పెళ్లి చూడ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎంటర్‌టైన్‌మెంట్‌తో మెప్పించిన ఇమ్మాన్యుయెల్‌… ఇప్పుడు జీవితంలో కొత్త ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు.

Latest News