విధాత: ప్రపంచ క్రీడా ప్రేక్షకులను ముఖ్యంగా క్రికెట్ లవర్స్‌ను అలరించేందుకు ఐపీఎల్ రెడీ అయింది.
ఇప్పటికే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమై సూపర్ సక్సెస్ అవగా ఇప్పుడు ఐపీఎల్ (TATAIPL2025) పై అందరి దృష్టి పడింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఐపీఎల్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించారు.
దీని ప్రకారం మార్చి 22న ఈ టోర్నీ ప్రారంభం కానుండగా మే 25న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. మొత్తంగా 65 రోజుల పాటు 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి.
అయితే తొలి ఐపీఎల్ (TATAIPL2025) మ్యాచ్ మార్చి 22న కోల్‌కతా వేదికగా స్టార్ట్ అవనుండగా తొలి మ్యాచ్‌లో RCB వర్సెస్ KKR తలపడనున్నాయి.
ఇక మన సన్ రైజర్స్ మార్చి 23న హైదరాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.