TGS RTC Good News: హైదరాబాద్ నగర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. నగర వాసులు ఆర్టీసీ బస్సుల్లో మరింత చౌకగా..ఎక్కువగా ప్రయాణించేందుకు ఓ వినూత్నమైన పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. రూ.20 ధరకే ‘మెట్రో కాంబి టికెట్’ ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్ పాస్ కలిగిన వారు రూ.20కాంబినేషన్ టికెట్ తో హైదరాబాద్ అంతటా మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రయాణించొచ్చు.
ఈ కాంబినేషన్ సదుపాయాన్ని మెట్రో డీలక్స్ బస్సులలో పొందవచ్చని ఎండీ వీ.సీ.సజ్జనార్ తెలిపారు. ఒకవైపు ఆర్టీసీ కార్మికులు ఈ నెల 7నుంచి సమ్మె చేస్తామంటున్న నేపథ్యంలో ఇంకోవైపు యాజమాన్యం మాత్రం ప్రయాణికులను ఆకట్టుకునేందుకు కాంబి టికెట్ ఆఫర్ ప్రకటించడం విశేషం.