Site icon vidhaatha

Bank Holidays In May 2025 | మే నెల‌లో బ్యాంకుల‌కు 12 రోజులు సెల‌వులు.. జాబితా ఇదే..!

Bank Holidays In May 2025 | నేటితో ఏప్రిల్ నెల( April Month ) ముగుస్తుంది. రేప‌ట్నుంచి మే నెల( May Month ) ప్రారంభం కానుంది. దీంతో మే నెల‌కు సంబంధించిన బ్యాంకు సెల‌వుల( Bank Holidays ) జాబితాను రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( Reserve Bank of India ) విడుద‌ల చేసింది. ఆర్బీఐ( RBI ) ప్ర‌క‌ట‌న ప్ర‌కారం మే నెల‌లో దేశ వ్యాప్తంగా వివిధ బ్యాంకుల‌కు 12 రోజుల పాటు సెల‌వులు ఉన్నాయి. ఈ సెల‌వుల్లో కొన్ని జాతీయ సెల‌వులు కాగా, మ‌రికొన్ని ప్రాంతీయ సెల‌వులు కూడా ఉన్నాయి. 12 రోజులు సెల‌వులు రావ‌డంతో.. ఖాతాదారులు గ‌మ‌నించి, వ‌ర్కింగ్ డేస్‌లో త‌మ ప‌నులు చ‌క్క‌బెట్టుకోవ‌డం మంచిది.

మే నెల‌లో బ్యాంకుల‌కు సెల‌వు దినాలు ఇవే..

మే 1 (గురువారం) : కార్మికుల దినోత్సవం, మహారాష్ట్ర డే, గుజరాత్ డే
మే 4 (ఆదివారం)
మే 9 (శుక్రవారం) : రవీంద్రనాథ్ టాగూర్‌ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని బ్యాంకులకు సెలవు.
మే 10 రెండో శనివారం
మే 11 (ఆదివారం)
మే 12 (సోమవారం) : బుద్ధ పూర్ణిమ సందర్భంగా కర్ణాటకలోకి బ్యాంకులకు సెలవు.
మే 16 (శుక్రవారం) : సిక్కిం స్టేట్ డే సందర్భంగా సిక్కింలోని బ్యాంకులు ఈ రోజు పనిచేయవు.
మే 18 (ఆదివారం)
మే 24 (శనివారం) : నాలుగో శనివారం
మే 25 (ఆదివారం) :
మే 26 (సోమవారం) : కాజీ నజ్రుల్ ఇస్లాం జన్మదినం సందర్భంగా త్రిపురలోని బ్యాంకులకు సెలవు.
మే 29 (గురువారం) : మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా రాజస్థాన్‌, హిమాచల్ ప్రదేశ్‌, హర్యానాలోని బ్యాంకులకు సెలవు.

Exit mobile version