Bank Holidays | మార్చి 31తో ఆర్థిక సంవత్సరం( Finance Year ) ముగియనుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబోయే ఏప్రిల్ నెలలో బ్యాంకులకు సెలవులే( Bank Holidays ) సెలవులు వచ్చాయి. ఒకట్రెండు రోజులు కాదు.. ఏకంగా 10 రోజుల పాటు సెలవులు వచ్చాయి. కాబట్టి సెలవుల నేపథ్యంలో వర్కింగ్ డేస్‌లో బ్యాంకు పనులను చక్కబెట్టుకోవడం మంచిది.
ఏప్రిల్ 01, 2025న బ్యాంకుల్లో ఆర్థిక కార్యకలాపాలు ఉండవు. ఎందుకంటే పాత ఆర్థిక సంవత్సరానికి సంబంధిత ఖాతాలను ముగించే పనుల కారణంగా, 2025 ఏప్రిల్ 01న బ్యాంకుల్లో సాధారణ బ్యాంకింగ్ జరగదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది.
ఇది కాకుండా, ఏప్రిల్‌లో బ్యాంకులు మరో 10 రోజులు మూతబడనున్నాయి. రెండు, నాలుగు శనివారాలతో పాటు ఆదివారాలు, శ్రీరామనవమి, అంబేద్కర్ జయంతి, గుడ్ ఫ్రైడే వంటి సెలవులు ఉన్నాయి. అంబేద్కర్ జయంతి సందర్భంగా బ్యాంక్‌లు ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 14 వరకు వరుసగా 3 రోజులు సెలవులో ఉంటాయి.
ఏప్రిల్‌లో బ్యాంకులకు సెలవులు ఇవే..( Bank Holidays For April 2025 )
ఏప్రిల్ 06 – శ్రీరామనవమి
ఏప్రిల్ 10 – మహావీర్ జయంతి
ఏప్రిల్ 12 – రెండో శనివారం
ఏప్రిల్ 13 – ఆదివారం
ఏప్రిల్ 14 – డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 18 – గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 20 – ఆదివారం
ఏప్రిల్ 26 – నాలుగో శనివారం
ఏప్రిల్ 27 – ఆదివారం