Bank Holidays | సెప్టెంబర్‌లో దాదాపు సగం రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ప్రతినెలా బ్యాంకులకు సెలవులు ఉండే విషయం తెలిసిందే. బ్యాంకుల సెలవులకు సంబంధించిన జాబితాను ఆర్‌బీఐ విడుదల చేసింది. ఏవైనా ఆర్థిక సంబంధిత పనుల కోసం వెళ్లేవారు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయో.. సెలవులుంటాయో తెలుసుకోవడం మంచిది. సాధారణ సెలవులతో పాటు పండుగ సెలవులు కలుపుకొని పది రోజులు సెలవులు రానున్నాయి. అయితే, బ్యాంకులు మూసి ఉన్నా మొబైల్, ఇంటర్‌నెట్ బ్యాంక్, యూపీఐ సర్వీసులు నిరంతరాయంగా పని చేస్తుంటాయి. డబ్బుల లావాదేవీలకు వీలుంటుంది. నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు అందుబాటులో ఉండనున్నాయి. పలు బ్యాంకులు క్యాష్ డిపాజిట్ కోసం మెషిన్స్ సైతం అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో అకౌంట్‌లో డబ్బులు చేసుకునే వీలున్నది. కొన్ని సేవల కోసం బ్యాంకులకు వెళ్లే అవసరం ఉంటుంది. అలాంటి సమాచారం సెలవుల గురించి సమాచారం ఉంటే.. ముందస్తుగానే పనులు చేసుకునే వీలుంటుంది.
సెప్టెంబర్‌లో బ్యాంకుల సెలవులు ఇవే..
1వ తేదీ : ఆదివారం సెలవు.
5వ తేదీ : శ్రీమంత శంకరదేవ తిథి సందర్భంగా అసోంలో సెలవు.
7వ తేదీ : వినాయక చవితి సందర్భంగా సెలవు.
8వ తేదీ : ఆదివారం సందర్భంగా సెలవు.
13వ తేదీ : రామ్‌దేవ్ జయంతి, తేజ దశమి సందర్భంగా రాజస్థాన్‌లో సెలవు.
14వ తేదీ : కేరళలో ఓనం సందర్భంగా సెలవు.
15వ తేదీ : ఆదివారం సందర్భంగా హాలీడే
16వ తేదీ : ఈద్ మిలాద్ సందర్భంగా సెలవు
17వ తేదీ : ఇంద్ర జాత్ర సందర్భంగా సిక్కింలో హాలీడే
18వ తేదీ : నారాయణగురు జయంతి నేపథ్యంలో కేరళలో సెలవు
21వ తేదీ : నారాయణగురు సమాధి నేపథ్యంలో సెలవులు
22వ తేదీ : ఆదివారం సదర్భంగా సెలవు
23వ తేదీ : బలిదాన్ డే సందర్భంగా హర్యానాలో సెలవు హాలీడే.
28వ తేదీ : నాల్గో శనివారం సందర్భంగా సెలవు.
29వ తేదీ : ఆదివారం సందర్భంగా హాలీ డే.