BSNL New Plan | ప్రభుత్వ టెలికం సంస్థ భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) హవా కొనసాగుతున్నది. ఇటీవల ప్రైవేటు టెలికం కంపెనీలు టారిఫ్ రేట్ల (Tariff Rates)ని భారీగా పెంచుతూ వినియోగదారులపై భారం మోపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ టెలికం సంస్థ 3జీ సేవలను విస్తరించడంతో పాటు 4జీ సేవలను ప్రారంభించింది. ఈ క్రమంలో చాలామంది యూజర్లకు అటువైపు దృష్టి సారిస్తున్నారు.
ఈ క్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ సరికొత్త ప్లాన్స్‌తో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇందులో భాగంగా మరో సరికొత్త ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఇందులో ఉచిత కాలింగ్ సదుపాయం, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా సైతం పొందే వీలున్నది. బీఎస్‌ఎన్‌ఎల్ రూ.1799 ప్లాన్ విషయానికి వస్తే.. ధర కాస్త ఎక్కువగా అనిపించినా.. భారీగానే ఆఫర్స్ ఇస్తున్నది. ఓటీటీలకు అదనంగా ఇకపై డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే, ఇంటర్‌నెట్ సైతం మంచి స్పీడ్‌తో వస్తుంది. ఈ ప్యాక్‌లో 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్‌నెట్‌ని వాడుకోవచ్చు. అలాగే అపరిమిత వాయిస్ కాలింగ్ ఉంటుంది. ప్రతినెలా 6500 జీబీ డేటా ప్రతినెలా పొందనున్నారు. ఈ డేటా లిమిట్ 20 ఎంబీపీఎస్ స్పీడ్ నెట్ పొందనున్నారు. ఈ రీఛార్స్ ప్యాక్‌లో ఇతర ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందనున్నారు.
బీఎస్‌ఎన్‌ఎల్ కాంప్లిమెంటరీగా అందిస్తున్నది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యుప్‌టీవీ ప్యాక్ (సోనీలైవ్, జీ5), లయన్స్ గేట్ ప్లే, షెమరోమీ, ఎపిక్‌ఆన్ అదనంగా పొందనున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న ఈ ఖరీదైన ప్యాక్‌లో ఎస్‌టీడీ, లోకల్ కాలింగ్ ఫ్రీ ల్యాండ్‌లైన్ కనెక్షన్ సైతం పొందనున్నారు. ఇక బీఎస్‌ఎన్‌ఎల్ త్వరలో సర్వీసులను మెరుగుపరుచనున్నట్లు పేర్కొన్నది. ఇటీవల బీఎస్‌ఎన్‌ఎల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాబోయే ఆరునెలల్లో మెరుగు చేస్తామని చెప్పింది. బీఎస్‌ఎన్‌ఎల్ టవర్స్‌ని ఏర్పాటు చేయబోతున్నది. ప్రస్తుతం 24వేల టవర్స్ అందుబాటులోకి తీసుకురాబోతున్నది.