WhatsApp | మెటా యాజమాన్యంలో వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ని పరిచయం చేస్తున్నది. ఎప్పటికప్పుడు కొత్త యూజర్లను ఆకట్టుకునేలా ఈ ఫీచర్స్‌ని లాంచ్ చేస్తున్నది. అలాగే వినియోగదారుల సౌకర్యంతో పాటు భద్రతకు పెద్ద పీట వేస్తున్నది. అదే సమయంలో పాత ఫీచర్స్‌లోనూ మార్పులు చేస్తూ వస్తున్నది. తాజాగా వాట్సాప్ iOS యూజర్లు ఎక్కువ నిడివి ఉన్న వీడియోలను స్టేటస్‌లు పెట్టుకునేలా అప్‌డేట్ తీసుకురాబోతున్నది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తున్నది. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo ఈ విషయాన్ని వెల్లడించింది.
ప్రస్తుతం ఈ ఫీచర్ iOS 24.10.10.74 బీటా వర్షెన్‌లో అందుబాటులో ఉంది. అప్‌డేట్ అందుబాటులోకి వస్తే గరిష్ఠంగా నిమిషం వరకు వాట్సాప్ స్టేటస్‌ని పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్‌ను ఇప్పటికే ఆండ్రాయిడ్‌లోనూ టెస్టింగ్ చేశారు. ప్రస్తుతం iOS బీటా టెస్టర్‌లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఒకసారి 30 సెకన్లపాటు మాత్రమే స్టేటస్ వీడియో పోస్ట్ చేసేందుకు వీలుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఒక నిమిషం పాటు స్టేటస్ వీడియోలను పోస్ట్ చేయవచ్చు.
వాబీఇన్ఫో నివేదిక మేరకు.. కెమెరాల కోసం జూమ్ కంట్రోల్ ఫీచర్‌ని సైతం అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఈ ఫీచర్ కొంత మంది iOS బీటా యూజర్లకు అందుబాటులోకి తెచ్చిందని పేర్కొంది. త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దాంతో కెమెరా పనితీరు మెరుగుపడుతుందని భావిస్తున్నారు. దీంతోపాటు అదనపు ఫీచర్లు కూడా అందుబాటులోకి వస్తాయని సమాచారం. బీటా టెస్టర్‌లకు ప్రస్తుతం ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. కొత్త ఫీచర్‌తో వారంతా జూమ్ లెవల్‌ను మార్చుకొనేందుకు అవకాశాలున్నాయి.