Site icon vidhaatha

Chappal Price Hike | చెప్పులు కొత్తవి కొనాలనుకుంటే వెంటనే కొనేయండి..! రేపటి నుంచి మోత మోగనున్న ధరలు..!

Chappal Price Hike | చెప్పులను కొనాలనుకునే వారికి ఇది షాకింగ్‌ న్యూస్‌. ఆగస్టు నుంచి పాదరక్షల ధరలు పెరగనున్నాయి. ధరల పెరుగుదలకు ప్రధాన కారణం కొత్తగా నాణ్యత ప్రమాణాలు అమలులోకి వచ్చాయి. ఈ క్రమంలో వినియోగదారులపై మరింత భారపడబోతున్నది. చెప్పులకు సంబంధించిన కొత్త నాణ్యత ప్రమాణాలు ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి రాబోతున్నది. దాంతో అప్పటి నుంచి తయారయ్యే షూలు, స్లిపర్స్‌, సాండిల్స్‌ కొత్తగా ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయాలని బ్యూరో ఆఫ్‌ ఇండియా స్టాండర్ట్‌ ఆదేశించింది. దీంతో రాబోయే నెలలో ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఐఎస్‌ ఉత్తర్వుల మేరకు.. ఫుట్‌వేర్‌ తయారీదారులు ఐఎస్‌ 6721, ఐఎస్ 10702 నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందే.

సవరించిన నాణ్యతా నిబంధనల ప్రకారం.. ఫుట్‌వేర్‌ తయారీలో ఉపయోగించే రెగ్జిన్‌, ఇన్‌సోల్‌ తదితర ముడి సరుకుకు తప్పనిసరిగా రసాయన పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. చెప్పుల బయటి భాగాలకు ఉపయోగించే మెటీరియల్‌ చెరగకుండా.. మన్నికగా ఉంటుందని చెప్పే నాణ్యత పరీక్షల్లో ముడి సరుకు తప్పనిసరిగా పాస్‌ కావాల్సిందే. వినియోగదారులకు అసౌకర్యం కలుగకుండా ఎక్కువ రోజులు మన్నికగా ఉండే ఉత్పత్తులను అందించేందుకు ఈ నిబంధనలను తీసుకువచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయంతో చిన్న కంపెనీలకు భారీ ఊరట లభించనున్నది. రూ.50కోట్ల కంటే తక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న కంపెనీలు ఈ నిబంధనను పాటించాల్సిన లేదని.. పాత స్టాక్‌కు నిబంధనలు ఉండవని అధికార వర్గాలు తెలిపాయి.

అయితే, షూల సమాచారాన్ని బీఐఎస్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. మారిన రూల్స్తో చెప్పులు, బూట్లు, సాండిల్‌ ధరలు పెరిగే అవకాశాలున్నాయి. కొత్త ప్రమాణాలతో ఫుట్‌వేర్స్‌ తయారు చేసేందుకు కంపెనీలకు ఎక్కువగా ఖర్చయ్యే అవకాశాలున్నాయి. బీఐఎస్‌ నిబంధనలు ఆగస్టు నుంచి 46 వస్తువులకు వర్తించనున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు బీఐఎస్‌ నిబంధనలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. కొత్త నిబంధనల నేపథ్యంలో రెగ్జిన్‌, ఇన్‌సోల్‌, లైనింగ్‌ తదితర షూలలో ఉపయోగించే ముడి సరుకును పరీక్షించాల్సి రానున్నది. షూ బయటి బాగాన్ని సైతం చాలా ఖచ్చితంగా పరీక్షించనున్నారు. అయితే, ఫుట్‌వేర్స్‌ను మన్నికగా ఉన్నాయా? లేదా ? అనే విషయాన్ని బీఐఎస్‌ పరిశీలించనున్నది.

 

Read Also : 

Amazon Great Freedom Festival Sale | కొత్త స్మార్ట్‌ఫోన్లు కొనాలనుకుంటున్నారా..? ఆగండి ఆగండి..! అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ సేల్‌ వచ్చేస్తోంది..!

WhatsApp | సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతున్న వాట్సాప్‌..!

Exit mobile version