HDFC Credit Card Rules | క్రెడిట్‌కార్డు రూల్స్‌ను మార్చేసిన హెచ్‌డీఎఫ్‌సీ..! ఎప్పటి నుంచి అమలులోకి రాబోతున్నాయంటే..?

HDFC Credit Card Rules | దేశంలోని అతిపెద్ద ప్రైవేటురంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ కీలక నిర్ణయం తీసుకున్నది. క్రెడిట్‌కార్డులకు సంబంధించిన రూల్స్‌ మార్చేసింది. మారిన రూల్స్‌ ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. క్రెడిట్‌కార్డు ఛార్జీలతో పాటు పలు నియమాలను మార్చగా.. అవేంటో తెలుసుకుందాం రండి..!

  • Publish Date - June 30, 2024 / 12:00 PM IST

HDFC Credit Card Rules | దేశంలోని అతిపెద్ద ప్రైవేటురంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ కీలక నిర్ణయం తీసుకున్నది. క్రెడిట్‌కార్డులకు సంబంధించిన రూల్స్‌ మార్చేసింది. మారిన రూల్స్‌ ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. క్రెడిట్‌కార్డు ఛార్జీలతో పాటు పలు నియమాలను మార్చగా.. అవేంటో తెలుసుకుందాం రండి..!

రెంట్‌ చెల్లింపులపై ఛార్జీలు వసూలు

హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌కార్డుల ద్వారా రెంట్‌ చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేయనున్నది. క్రెడ్‌, చెక్‌, మొబిక్విక్‌, ఫ్రీఛార్జ్‌ తదితర యాప్‌ల ద్వారా రెంట్‌ మొత్తం చెల్లింపులపై ఒకశాతం ఛార్జ్‌ చేయనున్నది. ఒక్కో లావాదేవీపై గరిష్ఠంగా రూ.3వేల వరకు వసూలు చేయనున్నది. ఇక కార్డు హోల్డర్స్‌కు పెట్రోల్‌, డీజిల్‌కు సంబంధించిన లావాదేవీలపై సైతం పరిమితి విధించింది. రూ.15వేల కంటే తక్కువ లావాదేవీలకు ఎలాంటి అదనపు ఛార్జీలు విధించమని పేర్కొంది. అయితే, రూ.15వేల కంటే ఎక్కువ లావాదేవీలపై చేసే మొత్తంపై ఒకశాతం ఛార్జీ విధిస్తామని చెప్పింది. గరిష్ఠంగా రూ.3వేల వరకు ఫీజును వసూలు చేయనున్నట్లు చెప్పింది.

యూటిలిటీ లావాదేవీలపై..

ఇక యూటిలిటీ లావాదేవీలపై రూ.50వేల కంటే తక్కువ లావాదేవీల మొత్తంపై ఒకశాతం, ఒక్కో లావాదేవీకి అత్యధికంగా రూ.3వేల వరకు వసూలు చేయనున్నట్లు వెల్లడించింది. అయితే, బీమా లావాదేవీలకు ఛార్జీలను మినహాయించింది. కళాశాలలు, పాఠశాలలకు సంబంధించిన వెబ్‌సైట్స్‌, పీఓఎస్‌ మిషన్ల ద్వారా నేరుగా చేసే చెల్లింపులపై ఛార్జీలు ఉండవని తెలిపింది. అయితే, క్రెడ్‌, చెక్‌, మొబిక్విక్‌, ఇతర థర్డ్‌ పార్టీల ద్వారా చేసే చెల్లింపుల ద్వారా ఒకశాతం ఛార్జీ విధిస్తామని స్పష్టం చేసింది. ఎడ్యూకేషన్‌కు సంబంధించి ఇంటర్నేషనల్‌ చెల్లింపులపై సైతం ఛార్జీలను మినహాయించింది. ఇక అన్ని అంతర్జాతీయ, క్రాస్ కరెన్సీ లావాదేవీలపై 3.5శాతం మార్కప్ ఛార్జ్ వర్తిస్తుంది అని పేర్కొంది.

లేట్‌ ఫీ ఛార్జీలు..

క్రెడిట్‌కార్డులకు సంబంధించి లేట్‌ ఫీ ఛార్జీలను సైతం సవరించింది. రూ.100 నుంచి రూ.1300 వరకు ఉన్న బకాయి మొత్తం ఆధారంగా లేట్‌ ఫీ చెల్లింపు ఛార్జీలను సవరించింది. అలాగే, ఈఐఎం ఏదైనా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లో సులభమైన ఈఎంఐ తీసుకుంటే గరిష్ఠంగా రూ.299 వరకు ఈఎంఐ ప్రాసెసింగ్‌ ఛార్జీ వర్తించనున్నది. పైన పేర్కొన్న అన్ని ఛార్జీలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీఎస్‌టీకి లోబడి ఉంటాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పేర్కొంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ టాటా న్యూ ఇన్ఫినిటీ, టాటా న్యూ ప్లస్‌ క్రెడిట్‌కార్డుల్లో మార్పులను ఆగస్టు నుంచి అమలు చేయనున్నది. టాటా న్యూ ఇన్ఫినిటీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌కార్డు వినియోగదారులు అర్హత గల యూపీఐ లావాదేవీలపై 1.5శాతం కొత్తగా కాయిన్స్‌ ఇవ్వనున్నది.

Latest News