Bank Holidays | ఖాతాదారుల‌కు అల‌ర్ట్.. 26 నుంచి వ‌రుస‌గా మూడు రోజులు బ్యాంకులు బంద్

Bank Holidays | బ్యాంకు ఖాతాదారుల‌కు( Bank Account Holders ) ముఖ్య గ‌మ‌నిక‌. మ‌రో రెండు వారాల్లో ఈ నెల ముగియ‌నుంది. అయితే చివ‌రి శ‌నివారం(  Saturday ) అంటే నాలుగో శ‌నివారం, ఆ మ‌రుస‌టి రోజు ఆదివారం( Sunday )తో పాటు సోమ‌వారం కూడా బ్యాంకులు మూత‌ప‌డ‌నున్నాయి. దీంతో ఖాతాదారులు అప్ర‌మ‌త్త‌మై త‌మ లావాదేవీల‌ను ముందే సెటిల్ చేసుకుంటే బెట‌ర్.

Bank Holidays | హైద‌రాబాద్ : ఖాతాదారుల‌కు( Bank Account Holders ) అల‌ర్ట్.. ఈ నెల‌లో 26వ తేదీ నుంచి వ‌రుస‌గా మూడు రోజులు బ్యాంకులు( Banks ) మూత‌ప‌డనున్నాయి. ఈ నేప‌థ్యంలో బ్యాంకుల ద్వారా లావాదేవీలు జ‌రిపే ఖాతాదారులు అప్ర‌మ‌త్తం కావాల్సిందే. లేక‌పోతే చాలా ర‌కాలుగా న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంది.

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( Reserve Bank of India ) ఈ నెల మొద‌ట్లో విడుద‌ల చేసిన సెల‌వుల ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. దేశ వ్యాప్తంగా వ‌రుస‌గా మూడు రోజులు బ్యాంకుల‌కు సెల‌వులు రానున్నాయి. సాధారణంగా ప్రతి ఆదివారం( Sunday )తో పాటు రెండో శనివారం( Saturday ), నాలుగో శ‌నివారం బ్యాంకులు బంద్( Banks Bandh ) ఉంటాయి. అయితే జూలై 26వ తేదీన నాలుగో శ‌నివారం వ‌స్తుంది. దీంతో దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూత‌ప‌డ‌నున్నాయి. లావాదేవీలు ఆగిపోనున్నాయి. ఇక మ‌రుస‌టి రోజు ఆదివారం.. ఎలాగూ బ్యాంకులు ప‌ని చేయ‌వు. జులై 28న సోమవారం రోజు సిక్కిం( Sikkim )లో దృక్ప షే జీ సందర్భంగా అక్కడ మాత్రమే బ్యాంకుల‌కు సెల‌వు( Bank Holidays ) ప్ర‌క‌టించారు. దృక్ప షే జీ అంటే ఒక బుద్ధ ఫెస్టివల్( Budha Festival ) ఈ ప్రాంతాల్లో బ్యాంకుల్లో బ్రాంచులు బంద్ ఉంటాయి.

ఈ మేరకు మీరు కూడా బ్యాంకులకు ఏదైనా పని నిమిత్తం వెళ్లాల్సి వస్తే ముందుగానే బ్యాంకులు బంద్ ఉన్నాయా? లేదో తెలుసుకోండి. స్థానిక సెలవుల ఆధారంగా కూడా బ్యాంకు బ్రాంచీలు బంద్ ఉంటాయి. అందుకే ఏటీఎం( ATM ) సేవలు కూడా నిత్యం అందుబాటులో ఉంటుంది. అది కాకుండా ఎమర్జెన్సీ క్యాష్ కూడా మీ వద్ద పెట్టుకోండి.