ITR Scam | ఆదాయపు పన్ను చెల్లింపునకు జూలై 31తో గడువు ముగిసింది. ఇక రీఫండ్స్ కోసం పన్ను చెల్లింపుదారులు నిరీక్షిస్తున్నారు. అదనంగా పన్ను చెల్లించిన వారికి రీఫండ్ రూపంలో ఆదాయపు పన్నుశాఖ మొత్తాన్ని జమ చేయనున్నది. ఎవరైతే టీడీఎస్ రూపంలో ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్నారో వారంతా టీడీఎస్‌ను క్లెయిమ్ చేసుకునేందుకు ఐటీఆర్ రిటర్నులు ఉపయోగపడనున్నాయి. అయితే, ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత 45రోజుల్లో రీఫండ్ మొత్తం బ్యాంకు ఖాతాల్లో జమవనున్నది. ఐటీఆర్ దాఖలు చేసే సమయంలోనే బ్యాంకు వివరాలను సరిగా చూసకొని అందించాల్సి ఉంటుంది. లేకపోతే రీఫండ్‌లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆదాయ పన్ను శాఖ ఐటీఆర్ దాఖలు అనంతరం మదింపు అనంతరం రీఫండ్‌లో అకౌంట్‌లో జమ చేస్తుంది. ఈ నేపథ్యంలో దీన్ని ఆసరా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు తెరలేపారు.
పన్ను చెల్లింపుదారులకు ఫేక్ సందేశాలు పంపుతూ బోల్తా కొట్టిచేందుకు ప్రయత్నిస్తున్నారు. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని ఇటీవల ఆదాయపు పన్నుశాఖ సైతం అప్రమత్తం చేసింది. ఫేక్ మెసేజెస్ ద్వారా సైబర్ ఫ్రాడ్స్ ఆదాయపు పన్ను చెల్లింపుదారులను మోసం చేస్తున్నారని.. పలు యూఆర్‌ఎల్ లింక్‌ని పంపి వాటిపై క్లిక్ చేసి అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలని.. దాంతో రీఫండ్ వస్తుందని చెప్పి బోల్తా కట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో బ్యాంకు అకౌంట్ నంబర్‌ను సరి చూసుకోవాలని ఇన్‌కం టాక్స్ సూచిస్తుంది. ఆ తర్వాత ఐటీఆర్ దాఖలుకు అనుమతి ఇస్తుంది. ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా బ్యాంకు నంబర్లను ఎంటర్ చేయాలని అడగదని అధికారులు తెలిపారు. ఎవరికైనా ఫేక్ మెసేజ్‌లు వస్తే క్లిక్ చేయకుండా దూరంగా సూచించారు. ఎవరికైనా సందేహాలు ఉంటే ఐటీశాఖ అధికారిక వెబ్‌సైట్‌లోని గ్రీవెన్స్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.